For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'బంగారు' బాతు: 9,000 కిలోల బంగారాన్ని విక్రయించిన ప్రభుత్వం

|

గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో భాగంగా ప్రభుత్వం మధ్యకాల, దీర్ఘకాల డిపాజిట్ల సేకరించిన బంగారాన్ని విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా ప్రభుత్వం 9వేల కిలోల బంగారాన్ని వేలం వేసింది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ అధికారులు కూడా ధృవీకరించారు. దీంతో వ్యవస్థలోకి నగదు ప్రవాహం పెరిగింది.

2018లో భారత్‌కు భారీగా పెరిగిన డాలర్ల రాక2018లో భారత్‌కు భారీగా పెరిగిన డాలర్ల రాక

గోల్డ్ మానిటైజేషన్ స్కీం

గోల్డ్ మానిటైజేషన్ స్కీం

ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీం కింద మొత్తం ఫిబ్రవరి 20, 2019 నాటికి 15,650 కిలోల బంగారాన్ని సేకరించింది. ఇందులో 6,584 కిలోల బంగారం స్వల్పశ్రేణి బాండ్ల కింద, 2,938 కిలోల బంగారం మధ్యశ్రేణి కింద, 6,128 కిలోల బంగారం దీర్ఘశ్రేణి బాండ్ల కింద సమీకరించింది. ఈ క్రమంలో మధ్య, దీర్ఘశ్రేణి డిపాజిట్ల కింద సేకరించిన బంగారాన్ని విక్రయించారు.

గోల్డ్ సేకరణ

గోల్డ్ సేకరణ

గోల్డ్ మానిటైజేషన్‌ స్కీం కింద 2.5 శాతం వడ్డీరేటును చెల్లించడంతో పాటు చివరలో గోల్డ్ మొత్తానికి సమానమైన నగదును ఇస్తుంది. ప్రజల వద్ద ఉపయోగం లేకుండా పడి ఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తెచ్చేందుకు ఈ పథకాన్ని 2015లో ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఏడాది నుంచి 3 ఏళ్ల వ్యవధిని స్వల్పకాలికంగా, 4 ఏళ్ల నుంచి ఏడేళ్ల వ్యవధిని మధ్యకాలికంగా, 12 ఏళ్ల నుంచి పదిహేనేళ్ల వ్యవధిని దీర్ఘకాలికంగా పరిగణించారు. వడ్డీ రేటు 2.2 నుంచి 2.5 వరకు ఉంది.

మరో రెండు గోల్డ్ పథకాలు

మరో రెండు గోల్డ్ పథకాలు

ఈ క్రమంలో సేకరించిన బంగారంలోని మధ్య, దీర్ఘశ్రేణి డిపాజిట్ల భాగాన్ని విక్రయించారు. ప్రభుత్వ రంగానికి చెందిన ఎంఎంటీసీ తొమ్మిదివేల కిలోల బంగారాన్ని వేలం వేసింది. గోల్డ్ మానిటైజేషన్ స్కీం‌తో పాటు మరో రెండు స్కీంలు కూడా ఉన్నాయి. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం, ఇండియన్ గోల్డ్ కాయిన్ స్కీంలు కూడా ఉన్నాయి.

English summary

'బంగారు' బాతు: 9,000 కిలోల బంగారాన్ని విక్రయించిన ప్రభుత్వం | Golden goose: Govt reaps bonanza by selling 9,000 kg gold it got in monetisation scheme

The government has reaped in a bonanza of raising thousands of crores of rupees in liquid float in an added benefit of the gold monetisation scheme, which seeks to check import of the yellow metal into India and help prop up the country’s current account deficit.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X