ప్రైవేట్ బ్యాంకుల మద్దతుతో స్టాక్ మార్కెట్ సూచీలు నిన్నటి నష్టాలను రికవర్ చేసుకున్నాయి. నిఫ్టీ మళ్లీ 11650 పాయింట్ల మార్కుపైనే పటిష్టంగా ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 30వేల పాయింట్ల మార్కును దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలకు తోడు త్రైమాసిక ఫలితాల సీజన్ మొదలుకావడంతో ఇన్వెస్టర్లు కొద్దిగా కొనుగోళ్లకు దిగారు. దీంతో ఆఖరి గంటలో అనూహ్యంగా బయింగ్ సపోర్ట్ లభించడంతో సెన్సెక్స్ 266 పాయింట్లు లాభపడి 38966 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 11678 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 270 పాయింట్లు పెరిగి 30113 వద్ద స్థిరపడింది.
యెస్ బ్యాంక్, విప్రో, టాటా మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఆటో టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. ఏషియన్ పెయింట్స్, ఇండియాబుల్స్ హౌసింగ్, భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టైటాన్ టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి.

మొదటి దశ షురూ
గురువారం నుంచి మొదటి దశ పోలింగ్ షురూ కావడంతో ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడు దశల్లో జరగబోయే ఈ ఎన్నికల నేపధ్యంలో ఒడిదుడుకులు తీవ్రంగా ఉండొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
మూడో రోజూ లాభాల్లో శోభా
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శోభా డెవలపర్స్ స్టాక్ వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ట్రేడై రూ.500 మార్కును క్రాస్ చేసింది. సేల్స్ బుకింగ్స్ 9 శాతం పెరిగాయని సంస్థ ప్రకటించినప్పటి నుంచి స్టాక్‌లో జోరు పెరిగింది. దీనికి తోడు మోతిలాల్ సంస్థ దీనికి రూ.619 టార్గెట్ ఇవ్వడం కూడా జోష్ పెంచింది. ఇంట్రాడేలో రూ.512 వరకూ వెళ్లిన స్టాక్ చివరకు ఫ్లాట్‌గా రూ.496 దగ్గర క్లోజైంది.
ఏషియన్ పెయింట్స్‌కు అగ్నిప్రమాదం ఎఫెక్ట్
విశాఖ ప్లాంట్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించినట్టు ఏషియన్ పెయింట్స్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. అయితే దీని నష్టం ఏ స్థాయిలో ఉంది అనే అంశాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉందని సంస్థ ప్రకటించింది. దీనికి తోడు ఈ స్టాక్‌ను సిఎల్ఎస్ఏ డౌన్‌గ్రేడ్ చేసి టార్గెట్‌ను రూ.1400కు తగ్గించింది. వీటి నేపధ్యంలో ఏషియన్ పెయింట్స్ స్టాక్ 3.5 శాతం తగ్గి రూ.1443 దగ్గర క్లోజైంది.
ఏడో రోజూ ఎగిరి గంతు
ఇన్ఫోసిస్ స్టాక్ వరుసగా ఏడో రోజు కూడా లాభాల్లో ముగిసింది. రూ.773 లతో 52 వారాల గరిష్ట స్థాయిని స్టాక్ టచ్ చేసింది. గత 12 నెలల్లో ఏకంగా 36 శాతం పెరిగిన స్టాక్ నానాటికీ పటిష్టంగా మారుతోంది. చివరకు స్టాక్ రూ.760.60 దగ్గర ఫ్లాట్‌గా క్లోజైంది.
20 నెలల కనిష్టానికి స్టెరిలైట్
స్టెరిలైట్ టెక్నాలజీ స్టాక్ 20 నెలల కనిష్టానికి చేరింది. ఇంట్రాడేలో స్టాక్ ఏకంగా 12.6 శాతం పతనమై రూ.188కి పడిపోయింది. మూడీస్ తన కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్‌ను ఉపసంహరించుకుంది. దీంతో ఈ స్టాక్ భారీగాపతనమైనా చివరకు అనూహ్యంగా కోలుకుంది. కేవలం 4 శాతం నష్టాలతో రూ.208 దగ్గర క్లోజైంది.
ఫస్ట్‌సోర్స్‌కు జున్‌జున్‌వాలా కిక్
ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్‌లో రాకేష్ జున్‌జున్‌వాలా వాటాలు పెంచుకున్నారనే వార్తలు స్టాక్‌ను పరుగులు తీయించాయి. వాల్యూమ్స్‌తో సహా పెరిగిన స్టాక్ 7 శాతానికిపైగా పెరిగింది. చివరకు 5.5 శాతం లాభాలతో రూ.51.30 దగ్గర ముగిసింది.
డెల్టాకార్ప్ రిజల్ట్స్ అంతంతమాత్రం
ప్రముఖ గేమింగ్, క్యాసినోల నిర్వాహణా సంస్థ డెల్టాకార్ప్ ఫ్లాట్ రిజల్ట్స్‌ను ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో ఈ సంస్థ నికరలాభం 25.2 శాతం పెరిగింది. ఎబిటా 30.6 శాతం పెరిగితే, మార్జిన్లు 39.3 నుంచి 43.1 శాతానికి జంప్ చేశాయి. అయితే స్టాక్ మాత్రం అరశాతం నష్టపోయి రూ.262 దగ్గర ఆగింది.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.



Click it and Unblock the Notifications