For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హువావే పీ 30 ప్రో, పీ 30 లైట్: ఫోన్ ధరలు, ప్రత్యేకతలు ఇవే

|

ప్రముఖ మొబైల్ ఫోన్ల కంపెనీ హవావే మంగళవారం భారత మార్కెట్లోకి సరికొత్త ఫోన్‌ను తీసుకు వచ్చింది. వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉండటం దీని ప్రత్యేకత. గత నెలలో పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఫోన్‌ను వెల్లడించింది. ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధర రూ.71,900. అదనంగా మరో రెండు వేల రూపాయలు చెల్లిస్తే రూ.16వేల విలువైన హువావే వాచ్ జీటీ పొందవచ్చు.

సగటు జీవిత కాలం అంచనా: టాప్ 10 రాష్ట్రాలు ఇవేసగటు జీవిత కాలం అంచనా: టాప్ 10 రాష్ట్రాలు ఇవే

కాగా, ఈ ఫోన్‌తో పాటు హువావే పీ30 లైట్‌ను కూడా తీసుకు వచ్చింది. ఇది 4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ధరలు వరుసగా రూ.19,900, 22,900గా ఉన్నాయి. స్టార్టింగ్ ఆఫర్ కింద రిలయన్స్ జియో రూ.2,200 క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది.

 Huawei P30 Pro, Pro Lite Launched: Price, Specifications and Other Details

హువావే ఇటీవలే పీ 30 సిరీస్‌లో భాగంగా హువావే పీ 30, పీ 30 ప్రోలను ప్యారిస్‌లో ఆవిష్కరించింది. ఇవే ఫోన్లను ఇప్పుడు భారత మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ డిస్ ప్లే, పెద్ద బ్యాటరీతో పాటు ట్రిపుల్ బ్యాక్ కెమెరా, సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్, వైర్ లెస్ ఛార్జీంగ్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ దీని ప్రత్యేకతలు.

హువావే పీ 30 ప్రో ప్రత్యేకతలు

- 6.47 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే
- 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్స 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
- 2340 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- హువావే కిరిన్ 980 ప్రాసెసర్
- ఆండ్రాయిడ్‌ పై(ఇఎంయూఐ)
- బ్యాక్ 40+20+8 మెగా పిక్సెల్ కెమెరాల. దీంతో పాటు టైమ్‌ ఆఫ్‌ ఫ్లైట్‌ కెమెరా
-ప్రంట్ 32 మెగా పిక్సెల్ కెమెరా (సెల్ఫీ కెమెరా)
- 4200 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
- 15W వైర్ లెస్‌ ఛార్జింగ్‌, 40W సూపర్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌

హువావే పీ 30 లైట్ ప్రత్యేకతలు

- 6.15 ఇంచ్ ఫుల్ హెచ్‌ డిస్‌ప్లే
- 4జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్
- కిరిన్‌ 710 సాక్ ప్రాసెసర్‌
- బ్యాక్ సైడ్ 24+8+2 మెగా పిక్సెల్ ట్రిపుల్‌ కెమెరా
- 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా (సెల్ఫీ కెమెరా)
- 3,340 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ ఛార్జింగ్‌

English summary

హువావే పీ 30 ప్రో, పీ 30 లైట్: ఫోన్ ధరలు, ప్రత్యేకతలు ఇవే | Huawei P30 Pro, Pro Lite Launched: Price, Specifications and Other Details

The main draw, however, is the camera setup, which includes a quad-camera setup featuring 5x optical zoom in the periscopic lens layout, and up to 50x digital zoom.
Story first published: Tuesday, April 9, 2019, 17:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X