విమాన ప్రయాణం చేసేవారికి గుడ్‌న్యూస్: మీ పర్మిషన్ లేకుండా సీటు మార్చితే...

మీరు తరుచూ విమానాల్లో ప్రయాణిస్తున్నారా? మీరు విమానాల్లో ప్రయాణించేందుకు చాలా రోజుల ముందే బుక్ చేసుకున్నారా? మీకు తెలియకుండా మీ సీటు మార్చారా? ఈ విషయమై మీకు సదరు విమానయాన సంస్థ సరైన వివరణ ఇవ్వలేదా? అయితే ఇక్కడ మీరు ఓ ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇద్దరు ప్రయాణీకులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఎయిర్ ఇండియాను ఇటీవలే అపెక్స్ కన్స్యూమర్ కమిషన్ ఆదేశించింది. ఆశ్చర్యపోతున్నారా? దీనికి కారణం ఉంది. సదరు ప్రయాణీకులు ముందుగా బుక్ చేసుకున్న సీట్లు మార్చినందుకు ఈ పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఓ ప్రయాణీకుడికి వీల్ చైర్ సౌకర్యం కల్పించలేదు. అంతకుముందు ఎలక్ట్రానిక్ టిక్కెట్స్‌లో వారికి ఈ సౌకర్యాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.

సరైన వివరణ ఇవ్వకుండా మార్చితే

సరైన వివరణ ఇవ్వకుండా మార్చితే

ఎన్‌సీడీఆర్సీ ప్రెసిడెంట్ జస్టిస్ ఆర్కే అగర్వాల్, సభ్యులు ఎం శ్రీషా నేతృత్వంలోని కమిటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు ప్రయాణీకులకు ముందుగానే కేటాయించిన సీట్లను వారి అనుమతి లేకుండా, వారికి ఎలాంటి సరైన వివరణ ఇవ్వకుండా మార్చిందని, దీనికి గాను పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇది కేవలం డొమెస్టిక్ విమానంలోనే కాకుండా, ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లోను ఇలాగే వ్యవహరించింది. ఈ విమానయాన సంస్థ కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులకు గురయ్యారని, వారికి సరైన వివరణ ఇవ్వలేదని ఆ కమిటీ పేర్కొంది.

వీల్ చైర్ సౌకర్యం కల్పించలేదు

వీల్ చైర్ సౌకర్యం కల్పించలేదు

ఓ ప్రయాణీకుడికి వీల్ చైర్ సౌకర్యం కల్పించలేదు. ఈ విషయమై సదరు విమానయాన సంస్థ ఢిల్లీ విమానాశ్రయంలో వీల్ చైర్‌ల కొరత ఉందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ దీనిని కమిటీ తిరస్కరించింది. ఎలక్ట్రానిక్ టిక్కెట్‌లో వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తున్నట్లుగా ఉందని పేర్కొంది. అలాగే, ప్రయాణీకులు రెండు నెలల ముందు టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వారికి తెలియకుండా సీట్లు మార్చారు.

ఎన్‌సీడీఆర్‌సీ

ఎన్‌సీడీఆర్‌సీ

అంతకుముందు, వెస్ట్ బెంగాల్ స్టేట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెస్సల్ కమిషన్ 2017లో విమానయాన సంస్థకు ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఈ సంస్థ ఎన్‌సీడీఆర్‌సీ దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రయాణీకులు కోల్‌కతా నుంచి న్యూఢిల్లీ, అక్కడి నుంచి చికాగోకు వారు ప్రయాణం చేయాల్సి ఉంది. 2014లో ఈ టిక్కెట్స్ ఖరీదు ఒక్కోటి రూ.1.45 లక్షలు. ప్రయాణీకులు స్టేట్ కమిషన్‌కు వెళ్లడంతో ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ఎన్‌సీడీఆర్సీ తొలుత స్టే విధించింది. ఆ తర్వాత రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+