For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: రూ.33వేల మార్క్ దాటిన గోల్డ్

|

బంగారం ధరలు భారీగా పెరిగాయి. రూ.33వేల మార్కును దాటాయి. డిమాండ్ తగ్గటంతో కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే రూ.425 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందన, ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడం వంటి కారణాలతో బంగారం ధర మళ్లీ రూ.33 వేల మార్క్‌ను దాటింది.

సగటు జీవిత కాలం అంచనా: టాప్ 10 రాష్ట్రాలు ఇవేసగటు జీవిత కాలం అంచనా: టాప్ 10 రాష్ట్రాలు ఇవే

రూ.425 పెరిగి, రూ.33వేల మార్క్ దాటిన బంగారం

రూ.425 పెరిగి, రూ.33వేల మార్క్ దాటిన బంగారం

సోమవారం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.33,215 పలికింది. న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల ధర ఒకేరోజు రూ.425 పెరిగి 33 మార్క్ దాటిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.33,215కు పెరగగా, 99.5శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ.33.045కు పెరిగింది. శనివారం బంగారం ధర రూ.32,790 వద్ద ముగిసింది. బంగారంతో పాటు వెండి రేటు కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ.170 అధికమై రూ.38,670గా నమోదైంది.

పెరుగుదలకు కారణాలివే

పెరుగుదలకు కారణాలివే

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతోపాటు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో విలువైన లోహాలకు డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. అంతర్జాతీయంగా కూడా వీటి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఫ్లాట్‌లో 100 పీసెస్ సిల్వర్ కాయిన్ అమ్మకం రూ.80,000, అమ్మకం రూ.81,000గా ఉంది.

రూపాయి మారకం విలువ

రూపాయి మారకం విలువ

న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,298.30 డాలర్లు పలికింది. వెండి 15.23 డాలర్ల నమోదయింది. అమెరికా వేతనాల్లో వృద్ధి మందగించడంతో ఆ దేశ కరెన్సీకి డిమాండ్ పడిపోయింది. మరోవైపు, డాలర్ మారకంతో కూపాయి విలువ సోమవారం ఇంటర్ ఫారెక్స్ మార్కెట్లో 44 పైసలు పడిపోయింది. 69.67 వద్ద క్లోజ్ అయింది. మంగళవారం మాత్రం 8 పైసలు బలపడి 69.59 వద్ద ప్రారంభమైంది.

English summary

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: రూ.33వేల మార్క్ దాటిన గోల్డ్ | Gold Crosses Rs 33,000 Mark, Silver Firms Up

Gold prices surged by ₹425 to ₹33,215 per 10 gram in the national capital on Monday due to increased buying by jewellers amid firm trend overseas, according to the All India Sarafa Association.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X