హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త. ఈ బ్యాంకు నుంచి లోన్ తీసుకునే వారికి వడ్డీ రేటు కొంత తగ్గనుంది. ఈ వడ్డీ రేట్ల తగ్గింపు 5 నుంచి 10 బేస్ పాయింట్ల మధ్య ఉండనుంది. ఏప్రిల్ 8వ తేదీ నుంచే ఈ రేట్లు అమలులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంసీఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్స్) రేటు 8.35 ఉండేది. తాజా నిర్ణయంతో అది 8.30కు చేరింది.
నాలుగు రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లను ఆ మేరకు కాస్త తగ్గించంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఆర్బీఐ రెండుసార్లు రెపో రేటును తగ్గించింది. ఫిబ్రవరిలో పావు శాతం, ఇటీవల నాలుగు రోజుల క్రితం మరో పావు శాతం తగ్గించింది. దీంతో మొత్తంగా 6.50గా ఉన్న రెపో రేటు 6 శాతానికి తగ్గింది. అంతేకాదు, పాలసీ విధాన మార్పుల ఫలాలను ప్రజలకు చేరువ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది.

ఈ నేపథ్యంలో హెచ్‍డీఎఫ్‌సీ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక నెల వడ్డీ రేటు 8.40 నుంచి 8.30కు, మూడు నెలల రేటు 8.45 నుంచి 8.40కు, ఆరు నెలల రేటు 8.55 నుంచి 8.50కు, ఏడాదికి 8.75 నుంచి 8.70కు, రెండేళ్లకు 8.85 నుంచి 8.80కు, మూడేళ్లకు 9 శాతం నుంచి 8.95గా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎంసీఎల్ఆర్‌ను మార్చి 7వ తేదీన చివరిసారి సమీక్షించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications