For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంటికి జియో గిగా ఫైబర్: హైస్పీడ్ ఇంటర్నెట్, ఈ విషయాలు తెలుసుకోండి

|

జియో గిగా ఫైబర్ కనెక్టివిటీ (Jio Giga Fiber) ఇది నేరుగా మీ ఇంటికి వస్తుంది! మొబైల్ విప్లవం, డేటా విప్లవం సృష్టించిన జియో ఇప్పుడు జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీస్‌ను ప్రారంభించనుంది. దీనిని ఫైబర్ టు ది హోమ్ ఆధారంగా కేబుల్ వ్యవస్థ ద్వారా అందిస్తారు. జియో ఎక్కువ వేగంతో తక్కువ ధరలకు సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. జియో ఫైబర్ టు ది హోం (ఎఫ్‌టీటీహెచ్) మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో రానుంది.

ఒక కేంద్రం నుంచి ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్‌ను నేరుగా ఇంటికి వేయడాన్ని ఎఫ్‌టీటీహెచ్ అంటారు. ఇప్పుడు చాలా ఫైబర్ కేబుల్ సర్వీసుల్లో ఇంటర్నెట్ కాస్త స్లోగా ఉంటుంది. కానీ జియో గిగా ఫైబర్ అల్ట్రా హై డెఫినేషన్ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ సేవలు, వీడియో కాన్ఫరెన్స్, వాయిస్ యాక్టివేటెడ్ వర్చువల్ అసిస్టెన్స్, వర్చువల్ గేమింగ్, డిజిటల్ షాపింగ్ వంటి సేవలు అందుతాయి. చాలా ఫాస్ట్‌గా అప్ లోడ్, డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

<strong><br>పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ ఎందుకు అవసరం?</strong>
పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ ఎందుకు అవసరం?

 పలు నగరాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలన

పలు నగరాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలన

జియో గిగా ఫైబర్‌ను ముంబై, ఢిల్లీ, సూరత్, అహ్మదాబాద్ పట్టణాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. 90 రోజులకు గాను 100 ఎంబీపీఎస్ అల్ట్రా హైస్పీడ్ వేగంతో పనిచేసే కనెక్షన్లు ఆఫర్ చేస్తున్నారు. 100 జీబీ కోటాతో నెలసరి ఆఫర్ కూడా ఉంది. నెలలో 100 జీబీ డాటాను కనుక మీరు కంప్లీట్‌గా ఉపయోగిస్తే జియో డాట్ కామ్, మైజియో యాప్ ద్వారా 40 జీబీ కాంప్లిమెంటరీగా యూజ్ చేయవచ్చు. ప్రస్తుతానికి జియో గిగా ఫైబర్ సేవలు ప్రీపెయిడ్‌లోనే ఉన్నాయి. పోస్ట్ పేయిడ్ కూడా రానుంది.

 రూ.4500 రీఫండబుల్

రూ.4500 రీఫండబుల్

ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు లేవు. ఓఎన్టీ డివైస్ (గిగా హబ్ హోమ్ గేట్‌వే) కోసం మాత్రం రూ.4500 రీఫండబుల్ డిపాజిట్ ఉంటుంది. దీనిని చివరలో తిరిగి ఇస్తారు. ఈ మొత్తాన్ని డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా జియో మనీ లేదా పేటీఎం వంటి వాటి ద్వారా చెల్లించవచ్చు. కాగా, రిలయెన్స్ డెన్, హాత్ వే నెట్ వర్క్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే వీటి కొనుగోలును కూడా జియో ఫైబర్ నెట్ వర్క్ పూర్తి చేసింది.

డీటీహెచ్ విలీనం

డీటీహెచ్ విలీనం

కాగా, ప్రస్తుతం దేశంలో అతిపెద్ద డీటీహెచ్ ఆపరేటర్‌గా డిష్ టీవీ నిలిచింది. ఆ తర్వాత టాటా స్కై, ఎయిర్ టెల్‌లు ఉన్నాయి. త్వరలో ఎయిర్ టెల్, డిష్ టీవీలు విలీనం కానున్నాయని చెబుతున్నారు. జియో గిగా ఫైబర్ రాక నేపథ్యంలో అంతకుముందే పలు డీటీహెచ్‌లు విలీనమవుతున్నాయి. డిష్ టీవీ - వీడియో కాన్ డీ2హెచ్, రిలయెన్స్ బిగ్ టీవీ - వీకన్ మీడియా, టెలివిజన్‌లు విలీనమయ్యాయి.

Read more about: jio technology జియో
English summary

మీ ఇంటికి జియో గిగా ఫైబర్: హైస్పీడ్ ఇంటర్నెట్, ఈ విషయాలు తెలుసుకోండి | What is the Fiber to the Home technology in JioGigaFiber?

JioGigaFiber is the latest offering from Jio for your home. Jio offers superior internet experience to explore your Digital Life. Fiber is the technology of the future. It offers the ultimate broadband experience to surf, stream, game and work.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X