రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల రెపో రేటును పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో రెపో రేటు ఆరు శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ కస్టమర్లకు వడ్డీ రేటును తగ్గించనుందని తెలుస్తోంది. మే 1వ తేదీ నుంచి ఎస్బీఐ తమ కస్టమర్లకు సేవింగ్ డిపాజిట్స్ రేట్, షార్ట్ టర్మ్ లోన్ రేట్‌ను తాజా రెపో రేటును అనుసరించి ఇవ్వనుంది.
ఆర్బీఐ రెపో రేట్లను తగ్గించినప్పటికీ.. సాధారణంగా బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించేందుకు విముఖత చూపిస్తాయి. కానీ ఎస్బీఐ.. ఆర్బీఐని ఫాలో కానుంది. డిపాజిట్లు, స్వల్పకాలిక రుణాలను రెపో రేటుతో లింక్ చేయడం ఇదే మొదటిసారి. అయితే రూ.1లక్ష లోపు బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్‌ను, రూ.1 లక్ష వరకు ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి కలిగిన రుణగ్రహీతల్ని మినహాయిస్తున్నారు.

గతంలో ఆర్బీఐ రెపో రేటు తగ్గితే రుణగ్రహీతలు సంతోషించేవారు. కానీ అది గతం. ఇటీవలి కాలంలో ఆర్బీఐ రెపో రేటు తగ్గించినా పెంచినా బ్యాంకులు తమ ఇష్టానుసారం వడ్డీ రేట్లను విధిస్తున్నాయి. బ్యాంకులు తమ రుణాల వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు ఎంసీఎల్ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) విధానాన్ని పాటిస్తున్నాయి. దీంతో ఆర్బీఐ రేటు తగ్గించినా ఫలితం ఉండటం లేదు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications