ఢిల్లీ : ఎన్నికలకు ముందు రెండు సార్లు వడ్డీ రేట్ల కోత విధించిన ఆర్బీఐ త్వరలోనే మరోసారి గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. జూన్లో జరగనున్న సమీక్షా సమావేశంలో ఆర్బీఐ మరో 25 బేసిస్ పాయంట్ల మేర రెపో రేటు తగ్గించే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు సైతం ఇదే అంచనాతో ఉన్నాయి.
వృద్ధి రేటు పెంపు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఆర్బీఐ రేట్ కట్ దిశగా నిర్ణయం తీసుకోవచ్చని సీఎల్ఎస్ఏ అంచనా వేస్తోంది. జూన్లో 25 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర రేట్లు తగ్గించవచ్చని నివేదికలో అభిప్రాయపడింది. ఈ నిర్ణయం ద్వారా ప్రైవేట్ పైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు ఎక్కవ ప్రయోజనం పొందవచ్చని అభిప్రాయపడింది.

సిటీ, హెచ్ఎస్బీసీ బ్యాంకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. మరో దఫా 25పాయింట్ల మేర రెపోరేట్ తగ్గించాక ఆర్బీఐ వేచి చూసే ధోరణి అవలంబించవచ్చని హెచ్ఎస్బీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం ఆశించిన స్థాయిలో లేకపోయినా క్రమంగా పెరగొచ్చని చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి జీడీపీ 7శాతానికి చేరవచ్చని అంచనా వేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications