మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం గం.9.17 నిమిషాలకు నిఫ్టీ 36.90 పాయింట్లు లాభంతో 11,634.90 వద్ద, 11,600కు పైన, సెన్సెక్స్ 112.68 పాయింట్లు లాభపడి 38,797.40 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఫైనాన్షియల్ రంగానికి చెందిన షేర్లు దూకుడుగా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి.
యస్ బ్యాంక్, సిప్లా, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, హీరో మోటో, వేదాంత, జీ ఎంటర్టైన్మెంట్, సన్ ఫార్మా, ఐవోసీలు లాభపడగా, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, కోలా ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. కాగా, గురువారం 69.17తో ముగిసిన రూపాయి శుక్రవారం బలపడింది. 10 పైసలు బలపడి 69.07 వద్ద శుక్రవారం ప్రారంభమైంది.
రెపో రేటు తగ్గినా గురువారం నష్టాలు
స్టాక్ మార్కెట్లో గురువారం నష్టాల్లో కొనసాగిన విషయం తెలిసిందే. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ వివిధ కారణాలతో ఆటుపోట్లకు గురైంది. చివరికి సెన్సెక్స్ 192.40 పాయింట్ల నష్టంతో 38,684.72 పాయింట్ల వద్ద, 45.95 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 11,598 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆర్బీఐ రెపో రేటు తగ్గించినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ 7.4 శాతం నుంచి 7.2 శాతానికి కుదించడం, రూపాయి పతనం మార్కెట్‌ను దెబ్బతీశాయి. ఈ సంవత్సరం వరుణుడు పెద్దగా కరుణించే అవకాశం లేదనే హెచ్చరికలు కూడా తోడయ్యాయి. ఇక, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం 76 పైసలు బలహీనపడింది. 69.17 వద్ద ముగిసింది. ఇది కూడా ఓ కారణం.

రూపాయి లాభాలకు గురువారం బ్రేక్ పడింది. కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించినప్పటికీ, తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో రూపాయి పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే డాలర్ బలపడటం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి.
వరుసగా రెండో పాలసీలో కీలక రేట్లలో ఆర్బీఐ కోత విధించింది. దీంతో రూపాయి, బాండ్ల ధరలు పడిపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసల నష్టంతో 68.56 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80 పైసలు నష్టపోయి 69.21 వద్ద కనిష్టస్థాయిని తాకింది. చివరకు 76 పైసల నష్టంతో 69.17 వద్ద ముగిసింది. బుధవారం రూపాయి 33 పైసలు లాభపడింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications