ప్రేమ కోసం లక్షల కోట్లు వదులుకున్న అమెజాన్ సీఈవో మాజీ భార్య
ఆమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, మెకంజీ బెజోస్‌ల విడాకులు ఖరారయ్యాయి. ఈ క్రమంలో మెకంజీకి భరణం కింద అమెజాన్‌లో ఇరవై ఐదు శాతం వాటాలు రానున్నాయి. వీటి మార్కెట్ విలువ 36 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు. తనకు వచ్చే వాటాతో మెకంజీ ప్రపంచంలోనే అత్యంత ధనికురాలైన నాలుగో మహిళగా అవతరించారు.
కానీ ఇక్కడే ట్విస్ట్. భర్తతో విడాకుల ద్వారా వచ్చే ఈ డబ్బు తనకు అవసరం లేదని, అందుకే తన వాటాలపై వచ్చే కీలక హక్కులను, ఇతర అధికారాలను కూడా తాను ఎంతగానో ప్రేమించే తన మాజీ భర్త జెఫ్ బెజోస్‌కే వదిలేశారు. తనకు లభించే నాలుగు శాతం వాటాలపై వచ్చే ఓటింగ్ హక్కులను ఆమె తన మాజీ భర్తకే వదిలేశారు.

తనకు ఇష్టమైనవాటిని సంతోషంగా ఇచ్చేస్తానని, ది వాషింగ్టన్ పోస్ట్, బ్లూ ఆర్జిన్, 75 శాతం అమెజాన్ వాటాలు, తనకు లభించే వాటాలపై ఓటింగ్ హక్కులను జెఫ్‌కే వదులుకుంటున్నానుని మెకంజీ ట్వీట్ చేశారు. దీనికి జెఫ్ స్పందించారు. తన స్నేహితులు, కుటుంబ సభ్యులు చూపిన ప్రేమ అభిమానాలకు కృతజ్ఞతలు అని, ముఖ్యంగా మెకంజీకి అని ట్వీట్ చేశారు.
జెఫ్ ఫ్యామిలీకి చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కోసం పని చేసే కాలమిస్ట్ ఖషోగ్గీ హత్యకు గురైయ్యారు. దీంతో వాషింగ్టన్ పోస్ట్ సౌదీ యువరాజు సల్మాన్‌ను లక్ష్యంగా చేసుకొని కథనాలు రాసింది. దీంతో సౌదీ అధికారులు వ్యూహాత్మకంగా జెఫ్ బెజోస్ ఫోన్‌ను హ్యాక్ చేసి వ్యక్తిగత విషయాల్ని దొంగిలించారు. వాటిని నేషనల్ ఎంక్వైరర్ పత్రికకు అందించారు.
టీవీ యాంకర్ లారెన్‌తో జెఫ్ బెజోస్‌కు సంబంధాలు ఉన్నట్లు అమెరికా పత్రిక ఎంక్వైరర్‌లో వచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మెకంజీ సర్దుకుపోలేకపోయింది. మనస్పర్థలు వచ్చాయి. భర్త నుంచి విడాకులు కోరింది. స్నేహితులుగా కొనసాగుతామని చెప్పింది.


Click it and Unblock the Notifications