మార్కెట్ దెబ్బ, ఎలాన్ మస్క్‌కు షాక్: 2నిమిషాల్లో రూ.70,00,00,00,000 కోట్లు ఆవిరి
బిజినెస్ టైకూన్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కు కేవలం రెండు నిమిషాల్లో 1 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయాడు. గురువారం నాడు న్యూయార్క్ ట్రేడింగ్ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే టెస్లా కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో ఆయన భారీగా నష్టపోయాడు. రెండు నిమిషాల్లోనే టెస్లా కంపెనీ షేర్లు 11 శాతం మేర పడిపోయాయి. దీంతో ఎలాన్ మస్క్ 1.1 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. మన రూపాయల్లో దాదాపు రూ.70,00,00,00,000. ఇంత సంపాదన ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది.

బిలియన్ సంపద తుడిచిపెట్టుకుపోయింది
ఒక బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు తుడిచిపెట్టుకుపోవడంతో ఆయన నికర సంపద 22.3 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బ్లర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టెస్లా అమ్మకాలు భారీగా తగ్గాయి. గత ఏడాది నాలుగో త్రైమాసికంలో 90,966గా ఉ్న టెస్లా కార్ల అమ్మకాలు ప్రస్తుతం 63,000కు పడిపోయాయి. దీంతో కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయని తెలుస్తోంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు ఎనిమిది శాతం నష్టపోయాయి.

ఇటీవలే చైర్మన్ పదవి పోగొట్టుకున్నాడు
టెస్లా ఒక్కో షేర్ విలువ 420 డాలర్లుగా కొనుగోలు చేస్తానని, దానికి తగిన నిధులు ఉన్నాయని, ఈ ఏడాది ఆగస్ట్ 7వ తేదీన ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో ఆయన చైర్మన్ పదవిని పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త చైర్ పర్సన్‌గా రాబిన్ డెన్‌హోమ్‌ను నియమించారు. దీంతో ఎలాన్ మస్క్ సీఈవో పదవికి పరిమితమయ్యారు.

టెస్లా, స్పేస్ ఎక్స్
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద 22.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో పది బిలియన్ డాలర్లకు పైగా టెస్లా విక్రయాల నుంచి ఆర్జించారు. మిగతా సంపద స్పేస్ ఎక్స్ నుంచి వస్తోంది. ప్రముఖ రాకెట్ లాంచింగ్ సంస్థ స్పేస్ ఎక్స్‌ను సైతం ఎలన్ మస్క్ స్థాపించారు. స్పెస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్ప్ ద్వారా 13 బిలియన్ డాలర్లు సంపాదించారు. స్పేస్ ఎక్స్ ఇటీవలే అత్యంత శక్తిమంతమైన మానవరహిత రాకెట్‌ను ప్రయోగాత్మకంగా లాంచ్ చేసింది.


Click it and Unblock the Notifications