ఆర్బీఐ పాలసీ: రెపోరేటును పావు శాతం తగ్గించిన ఆర్బీఐ, హోం, కారు లోన్లు ఇక చౌక
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం మధ్యాహ్నం ద్రవ్య విధాన ప్రకటన చేసింది. రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించింది. రెండు నెలల క్రితం పావు శాతం తగ్గించిన ఆర్బీఐ, ఈ రోజు మరో పావు శాతం తగ్గించింది. దీంతో రెపో రేటు 6 శాతానికి తగ్గింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేవారికి వడ్డీ తగ్గే అవకాశాలున్నాయి. రెపో రేటు తగ్గిన నేపథ్యంలో కారు, హోమ్ లోన్లు తగ్గనున్నాయి.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల మానెటరీ పాలసీ కమిటీ (ద్రవ్య విధాన కమిటీ) మంగళవారం నుంచి వరుసగా మూడు రోజులు భేటీ అయింది. అనంతరం గురువారం పరపతి విధాన సమీక్షపై ప్రకటన చేశారు. ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గిస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెపో రోటును 6.5 ఉండగా పావు శాతం తగ్గించింది. దీంతో 6.25 శాతంగా ఉంది. ఇప్పుడు మరో పావు శాతం తగ్గించడంతో 6.00 శాతంగా ఉండనుంది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో బ్యాంకుల నుంచి తీసుకునే లోన్లు తగ్గనున్నాయి. కానీ ఇవి వెంటనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే స్వల్పకాలిక నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. బ్యాంకుల వద్ద నుంచి డబ్బు తీసుకున్నప్పుడు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు అంటారు. ఆర్బీఐ నిర్ణయం ప్రకారం రివర్స్ రెపో రేటు ఆరు శాతానికి చేరింది. ఉర్జీత్ పటేల్ స్థానంలో డిసెంబర్‌లో ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్ బాధ్యతలు చెపట్టిన తర్వాత రెపో రేటును తగ్గించడం ఇది రెండోసారి.


Click it and Unblock the Notifications