జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్.. ఎలా బుక్ చేయాలంటే: ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకోండి
రిలయెన్స్ జియో సెకండ్ జనరేషన్ స్మార్ట్ ఫీచర్ ఫోన్ ఫ్లాష్ సేల్ గురువారం (ఏప్రిల్ 4వ తేదీ) మధ్యాహ్నం గం.12.00 నుంచి ప్రారంభం కానుంది. మొబైల్ డేటా నెట్ వర్క్‌లో జియో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా జియో ఫోన్ 2 పైన ఫ్లాష్ సేల్ ప్రవేశ పెట్టింది. జియో ఫోన్‌ను జూలై 2018న లాంచ్ చేశారు. రిలయెన్స్ జియో నుంచి విడుదలైన తొలి 4జీ ఫీచర్ ఫోన్ ఇదే. Jio.com. లోకి జియో యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుంది. ఫ్లాష్ సేల్‌కు ముందు ఇది పలుమార్లు అందుబాటులోకి వచ్చింది.

జియోఫోన్ 2 ధర రూ.2,999
జియో ఫోన్ 2 ధరను రూ.2,999గా నిర్ణయించారు. రూ.5,000లోపు ధరల్లో ఇది మోస్ట్ పాపులర్ ఫీచర్ ఫోన్. ఫస్ట్ జనరేషన్ జియో ఫోన్ ధర రూ.1,499. జియోఫోన్ 2 QWERTY కీబోర్డును సపోర్ట్ చేస్తుంది. చూడటానికి బ్లాక్ బెర్రీలా ఉంటుంది. జియోఫోన్ 2 ఫీచర్ ఫోన్ కొనుగోలు చేస్తే ఉచిత వాయిస్ కాల్స్, డేటా ఆఫర్లు పొందవచ్చు. ఈ ఫోన్ సొంతం చేసుకునే యూజర్లు రూ.49, రూ.99, రూ.153 రీఛార్జ్ ప్లాన్‌తో యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్స్ అన్నింటికి 28 రోజుల వ్యాలిడిటీ. ఈ రీఛార్జ్ ప్లాన్స్‌లలో ప్రీ వాయిస్ కాలింగ్ ఆఫర్ కామన్. ఈ ఫోన్లో వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ మ్యాప్స్, ఎఫ్ఎం, బ్లూటూత్, వైఫై, ఎన్పీఎస్, జీపీఎస్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

జియోఫోన్ 2 స్పెసిఫికేషన్లు
జియోఫోన్ 2 స్పెసిఫికేషన్లు ఇవే. 2.4 అంగుళాల QVGA డిస్ ప్లే. డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్. 2000ఎంఏహెచ్ బ్యాటరీ. 512 ఎంబీ రామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్‌డీ కార్టుతో 128 జీబీ వరకు ఎక్స్‌పాండపుల్. KaiOS ఆపరేటింగ్ సిస్టం. 2ఎంపీ ప్రైమరీ కెమెరా0.3 ఎంపీ వీజీఏ కెమెరా. ఇది సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా. ఎఫ్ఎం, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

ఎలా కొనుగోలు చేయాలి
జియోఫోన్ 2ను ఇలా కొనుగోలు చేయవచ్చు. Jio.com లేదా MyJio mobile యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మొదట Jio.com వెబ్‌సైట్లోకి వెళ్లాలి. జియోఫోన్ 2ను సెలక్ట్ చేసుకోవాలి. మీ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. చెకౌట్ ప్రొసీడ్ అనంతరం మీ పేరు, ఈ-మెయిల్, మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు ఏ రూపంలో డబ్బు చెల్లిస్తారో అక్కడ ఉంటుంది. మీరు ఎంచుకున్న రూపంలో రూ.2,999 చెల్లించాలి. ఆ తర్వాత మీకు ఆర్డర్ కన్‌ఫర్మేషన్ వస్తుంది. ఈ-మెయిల్ మరియు ఎస్సెమ్మెస్ ద్వారా వస్తుంది.

జియో రీఛార్జ్ డేటా ఆఫర్లు
రూ.49తో రీఛార్జ్ చేస్తే జియోఫోన్ యూజర్లు రోజుకు 50 ఎస్సెమ్మెస్‌లతో పాటు 1 జీబీ డేటా పొందవచ్చు. రూ.99తో రీఛార్జ్ చేస్తే ఈ ప్లాన్ పైన 14జీబీ మొబైల్ డేటా, 300 ఎస్సెమ్మెస్‌లు పొందవచ్చు. రూ.153 రీఛార్జ్ చేస్తే అపరిమిత ఎస్సెమ్మెస్‌లు, 42 జీబీ డేటా.


Click it and Unblock the Notifications