ఇళ్లు, కార్లు కొనేవాళ్లకు గుడ్‍న్యూస్: మీ ఈఎంఐ తగ్గనుంది! మీరు ఎంత సేవ్ చేస్తారంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2019-20 ఆర్థిక సంవత్సరానికి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. రెపో రేటును పావు శాతం తగ్గించింది. 25 బేసిక్ పాయింట్లు తగ్గడంతో 6.25 శాతం నుంచి 6శాతానికి దిగింది. మిగిలిన అంశాలు యథాతథంగా కొనసాగించాలని మానిటరీ పాలసి కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత నిర్ణయంతో బ్యాంకులకు రుణాలు తక్కువగా వస్తాయి. దీంతో రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉండనుంది. ఎంఎస్ఎఫ్ రేటు, బ్యాంకు రేటు, 6.25 శాతానికి చేరింది. ప్రస్తుతం ఇదే విధానం కొనసాగించాలని నిర్ణయించింది. వృద్ధిరేటును కొనసాగిస్తూనే వినియోగదారుల ధరల సూటీ ద్రవ్యోల్భణాన్ని 4 శాతం కట్టడి చేయాలని నిర్ణయించింది. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో హోంలోన్లు, కారు లోన్లు తీసుకునే వారికి శుభవార్త. ఈఎంఐ ధరలు తగ్గనున్నాయి.

హోం, కారు లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్
రెపో రేటు తగ్గడం కొత్తగా హోమ్ లోన్, కారు లోన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్. ఆర్బీఐ రెపో రేటు తగ్గించినప్పటికీ కస్టమర్లకు అందించడం మాత్రం బ్యాంకుల నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఆర్బీఐ దారిలోనే బ్యాంకులు నడిస్తే మాత్రం శుభవార్తే. హోమ్, కారు లోన్లతో పాటు పర్సనల్, ఎడ్యుకేషన్ లోన్లు కూడా తగ్గనున్నాయి. హోమ్ లోన్ రేటు 9 శాతం వద్ద ఉంటే.. 15 ఏళ్లకు ఒక లక్ష పైన ఈఎంఐ 1,014గా ఉంటుంది. రెపో రేటు 100 బేసిక్ పాయింట్లు తగ్గిస్తే అంటే 1 శాతం తగ్గిస్తే ఈఎంఐ రూ.956 అవుతుంది. రూ.30 లక్షలపై ఒక శాతం తగ్గితే రూ.1740 అవుతుంది.

తాజా రెపో రేటుతో హోమ్ లోన్ ఈఎంఐ ఎంత ఉంటుందంటే?
ఆర్బీఐ రెపో రేటును 25 పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు 6 శాతంగా ఉంది. బ్యాంకులు కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే హోమ్ లోన్ ఈఎంఐ ఇలా తగ్గుతుంది.
- రూ.30 లక్షల రుణం 15 ఏళ్ల కాలపరిమితితో తీసుకుంటే ఇప్పటి వరకు ఉన్న ఈఎంఐ 29,983 (8.75 శాతం)గా ఉంటుంది. బ్యాంకులు తగ్గిస్తే మాత్రం ఈఎంఐ ఇక నుంచి 29,542 (8.50 శాతం) అవుతుంది. వడ్డీ రేటులో తగ్గుదల రూ.79,380.
- రూ.75 లక్షల రుణం 15 ఏళ్ల కాలపరిమితితో తీసుకుంటే ఇప్పటి వరకు ఉన్న ఈఎంఐ 75,847 (8.95 శాతం)గా ఉంటుంది. బ్యాంకులు తగ్గిస్తే మాత్రం ఈఎంఐ ఇక నుంచి 74,737 (8.70 శాతం) అవుతుంది. వడ్డీ రేటులో తగ్గుదల రూ.1,99,800.
- రూ.1 కోటి రుణం 15 ఏళ్ల కాలపరిమితితో తీసుకుంటే ఇప్పటి వరకు ఉన్న ఈఎంఐ 1,01,724 (9.05 శాతం)గా ఉంటుంది. బ్యాంకులు తగ్గిస్తే మాత్రం ఈఎంఐ ఇక నుంచి 1,00,240 (8.80 శాతం) అవుతుంది. వడ్డీ రేటులో తగ్గుదల రూ.2,67,120.

కారు లోన్ ఈఎంఐ
ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా కారు లోన్లపై వడ్డీని తగ్గిస్తే ఇలా ఉండే అవకాశముంది.
- రూ.5 లక్షల కారు లోన్ పైన 7 ఏళ్ల కాలపరిమితికి ఇప్పటి వరకు 8,108 (9.25 శాతం). తగ్గిస్తే మాత్రం ఈఎంఐ రూ.8,044 (9 శాతం) ఉండనుంది. అప్పుడు మొత్తం రిడక్షన్ ఇంట్రెస్ట్ కాస్ట్ రూ.11,520 అవుతుంది.
- రూ.10 లక్షల కారు లోన్ పైన 7 ఏళ్ల కాలపరిమితికి ఇప్పటి వరకు 16,216 (9.25 శాతం). తగ్గిస్తే మాత్రం ఈఎంఐ రూ.16,089 (9 శాతం) ఉండనుంది. అప్పుడు మొత్తం రిడక్షన్ ఇంట్రెస్ట్ కాస్ట్ రూ.22,860 అవుతుంది.


Click it and Unblock the Notifications