బిగ్ ప్రైవసీ ఫ్యూచర్: వాట్సాప్ గ్రూప్‌లో చేరడం ఇక మీ ఇష్టం, సరికొత్త ఫ్యూచర్

వాట్సాప్‌లో కొత్త సరికొత్త ఫ్యూచర్ వచ్చింది. ఎవరైనా వాట్సాప్ గ్రూప్‌లలో యాడ్ చేస్తారు. అందులో యాడ్ కావడం మనకు ఆసక్తి లేకపోయినా యాడ్ చేస్తారు. ఆ తర్వాత అందులో నుంచి బయటకు రావడం చాలామందికి ఇబ్బందికరంగా మారుతుంది. కొన్ని సందర్భాలలో మనకు ఇష్టంలేకపోయినా జాయిన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి తప్పించే విధంగా కొత్త ఫీచర్ వచ్చింది.

మీరు ఏదైనా గ్రూప్‌లో చేరాలా లేదా అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఇష్టం లేకుండా ఎవరూ జాయిన్ చేయలేరు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఒకే కంపెనీలో పని చేసే ఉద్యోగులు, ఒకే అంశం మీద పని చేస్తున్నవారు.. ఇలా కొత్త కొత్త గ్రూప్‌లు ఉంటాయి. ఈ గ్రూప్‌ల ద్వారా బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోడి ఉద్యోగులు.. ఇలా అందరితోను ఒకేసారి ముచ్చటించే అవకాశముంది. అలాగే, ఏదైనా విషయం ఒకరికి చెప్పాలనుకుంటే ఆ గ్రూప్‌లో పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎంతోమందిని ఇది ఒకే వేదిక పైకి తీసుకు వస్తుంది.

WhatsApp announces big privacy feature! Now, no one can add you to a group if you dont want to join

ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ కొందరు మనకు తెలియకుండా వివిధ గ్రూప్‌లలో చేరుస్తారు. ఆ గ్రూప్‌లలో చేరడం మనకు ఏమాత్రం ఆసక్తి ఉండదు. ఆ గ్రూప్‌లో మనం ఉండటం వల్ల అవసరం లేదని మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు వస్తాయి. దీంతో ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినా మళ్లీ యాడ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఉండదు.

గ్రూప్‌లో మీ నెంబర్‌ను యాడ్‌ చేసేందుకు అడ్మిన్‌ ప్రయత్నిస్తే మీరు ఆ గ్రూప్‌లో చేరాలా.. వద్దా.. అని మీకో రిక్వెస్ట్‌ వస్తుంది. మీకు ఇష్టం ఉంటే చేరవచ్చు లేదంటే లేదు.

బుధవారం నుంచి వాట్సాప్‌ ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి వచ్చింది. మరోవైపు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనూ వాట్సాప్ అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు టిప్ లైన్ సర్వీసును తీసుకు వచ్చింది. గ్రూప్‌ చాట్స్ కూడా మరింత భద్రం. ఈ ఫీచర్స్ కోసం వాట్సాప్‌ను అప్ డేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత అకౌంట్ ప్రైవసీని, గ్రూప్స్‌ను సెలక్ట్ చేసుకొని, అక్కడ Nobody, My Contacts, Everyone.. అని ఎంపిక చేసుకోవచ్చు. Nobody అంటే మిమ్మల్ని కొత్త గ్రూప్‌లో చేర్చే ముందు మీకు రిక్వెస్ట్ వస్తుంది. My Contacts అంటే మీ కాంటాక్ట్‌లో ఉన్నవారు మిమ్మల్ని యాడ్ చేయవచ్చు. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేకుంటే మాత్రం మీకు రిక్వెస్ట్ వస్తుంది. Everyone అంటే మాత్రం మిమ్మల్ని ఎవరైనా గ్రూప్‌లలో జాయిన్ చేయవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+