గూగుల్ ప్లస్ 'డెడ్': ఎందుకు మూతబడింది.. కారణాలెన్నో? వారు ఉపయోగించవచ్చు కానీ

సోషల్ మీడియా నెట్ వర్క్ గూగుల్ ప్లస్ తన సేవలను ఏప్రిల్ 2వ తేదీ నుంచి (మంగళవారం) నిలిపివేయడం ప్రారంభించింది. అంటే గూగుల్ ప్లస్ క్లోజ్ అయినట్లే! ఏడేళ్ల క్రితం ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పోటీగా ప్రారంభమైంది. సోషల్ మీడియాను ఏలేందుకు గూగుల్ ప్లస్ ద్వారా చేసిన ప్రయత్నం యూజర్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. గత ఏడాదే గూగుల్ ప్లస్ డెత్ వారెంట్‌పై గూగుల్ నిర్ణయించింది. తొలుత 2019 ఆగస్ట్ నాటికి క్లోజ్ చేయాలని భావించింది.

 సెక్యూరిటీ కారణాలు

సెక్యూరిటీ కారణాలు

అసలు 2011 చివర్లోనే గూగుల్ ప్లస్ అంతిమదశలో ఉన్నట్లు విశ్లేషకులు భావించారు. కానీ గూగుల్ దీని సేవలు నిలిపివేయలేదు. కానీ 2018లో సమాచార భద్రత ఉల్లంఘన జరిగిందని గుర్తించాక తన సోషల్ నెట్ వర్క్‌ను నిలిపేయాలని భావించింది. ఈ మేరకు డిసెంబర్ 2018లో షట్‌డౌన్‌ను కన్‌ఫర్మ్ చేసింది. దీనిని క్లోజ్ చేయడానికి ముఖ్యమైన మొదటి కారణం సెక్యూరిటీ కారణాలు. తమ సాఫ్టువేర్‌లో బగ్స్ కారణంగా కోట్లాది మంది వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీలు పొందగలిగాయని గూగుల్ అంగీకరించింది.

 యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలం

యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలం

గూగుల్ ప్లస్ యూజర్లను ఆకట్టుకునేలా చేయడంలో విఫలమైంది. అలాగే, గూగుల్ ప్లస్ నిర్వహణకు ఎన్నో వనరులు కావాలని గూగుల్ నిర్ణయానికి వచ్చింది. అయితే బిజినెస్, ఎంటర్‌ప్రైజెస్‌లు మాత్రం దీనిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ ప్లస్‌ను వారికి ఉపయోగపడేలా టూల్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తోంది. అదే సమయంలో, ఎవరైనా దీనిని లాంగ్ టైంలో ఉపయోగించలేరు.

ఖాతాలు తెరిచారు కానీ

ఖాతాలు తెరిచారు కానీ

గూగుల్ ప్లస్ 2011లో ప్రారంభమైన సామాజిక అనుసంధాన వేదిక. ఇందులో ఫోటోలు పోస్ట్ చేయవచ్చు. ఇండివిడ్యుయల్ ఫీడ్స్‌లో స్టేటస్ అప్‌లోడ్ చేయవచ్చు. తమ ఇతర సర్వీసులకు అనుగుణంగా ఒక సోషల్ లేయర్‌గా దీనిని డిజైన్ చేశామని గూగుల్ చెప్పింది. స్నేహితులను గ్రూప్‌గా ఏర్పాటు చేసుకొని హ్యాంగౌడ్స్ ద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ నెట్ వర్క్ ప్రారభించిన కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది తమ ఖాతాలు తెరిచారు. కానీ తక్కువ మంది దీనిని ఉపయోగించారు. చాలామంది ఖాతాలు తెరిచినా గూగుల్ ప్లస్ పైన ఉన్న సమయం చాలా తక్కువ.

ఎందుకు విఫలమైంది?

ఎందుకు విఫలమైంది?

సోషల్ మీడియా రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టడం కూడా గూగుల్ ప్లస్ విజయం సాధించకపోవడానికి ఓ కారణంగా చెబుతున్నారు. గూగుల్ ప్లస్ ఖాతా ఓపెన్ చేశాక ఈ నెట్ వర్క్ ఎలా పని చేస్తుందని తెలుసుకోవడానికి యూజర్లు సమయం కేటాయించలేకపోయారని కూడా చెబుతున్నారు. అలాగే, మారుపేర్లతో అకౌంట్లు ఓపెన్ చేయడంపై కూడా విధానాలు కఠినంగా ఉన్నాయి. ఫేక్ నేమ్స్ లేదా స్క్రీన్ నేమ్స్ ఉన్న వినియోగదారులను జీమెయిల్ వంటి తమ ఇతర సర్వీసుల్లో లాక్ చేసింది. గూగుల్ ప్లస్ మాధ్యమంగా వ్యాపారం చేసే పేజీలను డిలీట్ చేసింది. ఈ పొరపాటును మాత్రం ఆ తర్వాత సరిదిద్దుకుంది. కొన్ని ఆప్షన్స్ కన్‌ఫ్యూజ్‌గా ఉన్నాయంటున్నారు. వినియోగదారులు తక్కువ టైం ఉపయోగించారు. గూగుల్ ప్లస్ వ్యవస్థాపకులు 2014లో కంపెనీని వీడారు. యూజర్లకు మరింత చేరువ అయ్యేందుకు గూగుల్ ప్లస్‌ను జీ మెయిల్ వంటి వాటికి అనుసంధానం చేసింది. ఆ తర్వాత యూట్యూబ్‌తో అనుసంధానం చేశారు. కానీ ఇవి ఆ తర్వాత విమర్శలకు కారణం అయ్యాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+