లండన్: బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని, లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా.. తన ఆస్తులను సీజ్ చేయడంపై తీవ్రంగానే స్పందించాడు. ఈడీ తన ఆస్తులను జఫ్తు చేయాలనుకున్నంత మాత్రాన బ్యాంకులు, రుణదాతలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నాడు. ఈ మేరకు విజయ్ మాల్యా బాంబై హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించాడు.
మాల్యా తరఫున ఆయన న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఆస్తుల చఫ్తు చర్యలు అమానుషమని పేర్కొన్నారు. తమకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఇతర రుణగ్రహీతలతో ప్రస్తుతం ఓ అవగాహన కుదుర్చుకోవడం అవసరమని పేర్కొన్నారు. విజయ్ మాల్యా తన ఆస్తులను తిరిగి కోరుకోవడం లేదన్నారు. ఆస్తులు జఫ్తు చేస్తే బ్యాంకులు, రుణదాతలకు ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు. మాల్యా తరఫు లాయర్ వాదనలు ఈడీ తప్పుబట్టింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా వేసింది.

కాగా, కొత్త చట్టం కింద మాల్యాను పారిపోయిన నేరస్తునిగా జనవరి 5వ తేదీన ముంబై స్పెషల్ కోర్టు పారిపోయిన నేరస్తునిగా ప్రకటించింది. ఇదే చట్టం కింద మాల్యా ఆశ్తుల జఫ్తుకు ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పైన వాదనలను ఈ నెల 8వ తేదీన ప్రత్యేక ఎంఎంఎల్ఏ (అక్రమ ధనార్జన) కోర్టు విననుంది. 2018 జనవరి 22వ తేదీన ఆమోదం పొందిన కొత్త చట్టం కింద ఈ తరహా కేసు విచారణ ఇదే తొలిసారి.
ఈడీ పిటిషన్‌కు ఆమోదం లభిస్తే మాల్యాకు చెందిన రూ.12,000 కోట్ల ఆస్తుల జఫ్తుకు, అలాగే వాటిని విక్రయించి రుణదాతలకు చెల్లించేందుకు ఈడీకి మార్గం సుగమం అవుతుంది. కానీతనను పారిపోయిన నేరస్తుడిగా జనవరి 5వ తేదీన ముంబై స్పెషల్ కోర్టు ప్రకటించడాన్ని మాల్యా సవాల్ చేశారు.


Click it and Unblock the Notifications