ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓఎన్జీసీ) గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన గ్యాస్ 6.5 శాతం పెరిగింది. కానీ ఈసారి రికార్డ్ స్థాయిలో పెరుగుదల కనిపించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను (మార్చి 31, 2019 వరకు) 25.9 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. ఈ పెరుగుదల గ్లోబల్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది.
2017-18 ఆర్థిక సంవత్సరంలో 24.61 బీసీఎంలుగా ఉన్న ఉత్పత్తి 2018-19లో 25.9 బీసీఎంలకు చేరింది. గతంలో ఎప్పుడూ ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో ఓఎన్జీసీ గ్యాస్ ఉత్పత్తి పెరగలేదు. పెరిగిన ఉత్పత్తిలో ఎక్కువ భాగం కంపెనీకి నామినేషన్ పద్ధతిపై కేటాయించిన క్షేత్రాల నుంచి వచ్చింది.
కొత్త క్షేత్రాలతోపాటు పాత క్షేత్రాల్లోనూ ఉత్పత్తి పెంచేందుకు అధునాతన పద్ధతులు ఉపయోగిస్తున్నారు. 2022 నాటికి దేశ చమురు దిగుమతులు పది శాతం మేర తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం మేరకు దేశంలో గ్యాస్ ఉత్పత్తి పెంచేందుకు ఓఎన్జీసీ కసరత్తు చేస్తోంది.

గతంలో కంటే గ్యాస్ ఉత్పత్తి పెరిగిందని ఓఎన్జీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శశిశంకర్ తెలిపారు. 2022 నాటికి 42 బీసీఎం ఉత్పత్తి చేయాలని ఓఎన్జీసీ లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటికి ఆంధ్రప్రదేశ్ తీరంలోని కేజీ బేసిన్‌లో ఉత్పత్తి అందుబాటులో ఉంటుందన్నారు.
ఈ ఏడాది చివరికల్లా కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. 2022నాటికి ఇక్కడ రోజువారీ ఉత్పత్తి 1.65 కోట్ల ప్రామాణిక ఘనపు మీటర్లకు చేరుకుంటుందని, దేశంలో గ్యాస్ ఉత్పత్తి పెం చేందుకు రూ.57,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం కేజీ బేసిన్, పశ్చిమ తీరంలో ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.
వచ్చే మూడేళ్లలో దేశంలోని వివిధ బేసిన్‌ల నుంచి 42 బీసీఎంల గ్యాస్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికి కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి గరిష్ఠ స్థాయికి చేరుకుని ఇందుకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. ప్రపంచంలో నేచరల్ గ్యాస్ ఉపయోగం వేగంగా పెరుగుతోంది.
గ్రీన్ హౌస్ ఉద్ఘారాల ఉపయోగాన్ని తగ్గించాలని భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నేచరల్ గ్యాస్ ఉపయోగం పెంచుతోంది. 2030 నాటికి మరో 15 శాతం వాటాను పెంచాలని చూస్తోంది.
2017-18తో పోల్చితే 2018-19 సంవత్సరానికి గాను గ్యాస్ సేల్స్ కూడా రికార్డ్ స్థాయిలో పెరిగినట్లు శివశంకర్ తెలిపారు. అంతకుముందు ఏడాది 19.494 ఉంటే, గత ఏడాది 20.472గా ఉందని తెలిపారు. ఓఎన్జీసీ ఆరు దశాబ్దాల చరిత్రలో గత ఏడాది నవంబర్ నెలలో రోజుకు 71 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల ఉత్పత్తితో రికార్డ్ సృష్టించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications