ఫుడ్ క్వాలిటీపై ప్రయాణీకుల ఫిర్యాదు నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ బెట్టర్ సర్వీస్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ-కేటరింగ్ ద్వారా ప్రయాణీకులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్ ద్వారా ప్రయాణీకులు మీల్స్, ఇతర పదార్థాలను తమ సీటు వద్దకు తెప్పించుకోవచ్చు. ఇందుకోసం ఇండియన్ రైల్వేస్ 500కు పైగా రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో డామినోస్, యాత్రీస్, రైల్‌రెస్ట్రో, రాజధాని ఆన్‌లైన్ ఫుడ్, జూప్ తదితర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్
దీంతో రైల్లో వివిధ ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో కూర్చున్న చోటకు ఆహారం, టిఫిన్లు తెప్పించుకోవచ్చు. ఇందుకు ఫుడ్ ఆన్ ట్రాక్ ఉపయోగపడుతుంది. ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్‌లో మీ పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ సీటు వద్దకు ఫుడ్ వస్తుంది. ఒకవేళ మీరు ముందే ఫుడ్ బుక్ చేసినా మీరు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే మీ ఫుడ్ ఆర్డర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. స్టేషన్లకు సమీపంలోని హోటళ్ల నుంచి ఆహారం తెప్పించుకునే వెసులుబాటు కూడా ఉంది. మెనూ ఆన్ రైల్స్ యాప్‌ను కూడా గత ఏడాది విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా రైలు ప్రయాణంలో అందించే ఫుడ్ ఐటమ్స్, వాటి ధరలను మీరు తెలుసుకునే వెసులుబాటు ఉంది. రైళ్లలో ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్ సేవలు అందుబాటులో ఉన్న రైళ్లలో ఈ మెనూ వివరాలు కనిపిస్తాయి.

ఫుడ్ ఆన్ ట్రాక్‌లో ఇలా ఆర్డర్ చేయండి
పాసింజర్ ఫ్రెండ్లీగా ఉండేందుకు ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్‌ను ఇండియన్ రైల్వేస్ అందుబాటులో ఉంచింది. ఇందులో ఫుడ్ ఆర్డర్ ఎలా చేయాలంటే... మొదట పీఎన్ఆర్ (పాసింజర్ నేమ్ రికార్డ్)ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన దానిని ఎంచుకోవచ్చు. మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత కన్‌ఫర్మ్ చేసే ముందు ప్రయాణీకులు రివ్యూ చేసుకునే వెసులుబాటు ఉంది. కన్‌ఫర్మేషన్ తర్వాత ప్రయాణీకులు తమ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పేరు, ఫోన్ నెంబర్, కోచ్ నెంబర్, సీట్ నెంబర్ ఇవ్వాలి. చెల్లింపులను వివిధ మార్గాల్లో చేయవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా చేయవచ్చు.

రెండు గంటల ముందు క్యాన్సిల్ చేసుకోవచ్చు
ప్రయాణీకులు ఆర్డర్ చేసిన అనంతరం అందుకు సంబంధించిన వివరాలు మీకు వస్తాయి. అలాగే, మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు, ఈమెయిల్‌కు ఓటిపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. ఫుడ్ డెలివరీకి 2 గంటల ముందు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా సవరించుకోవచ్చు. షెడ్యూల్ అరైవల్ సమయానికి ముందు స్టేషన్ లేదా సీటు మార్పు, రివిజన్ లేదా రద్దుకు అవకాశం లేదు. పీఎన్ఆర్ రద్దు లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే ఫుడ్ ఆన్ ట్రాప్ యాప్‌లో ఆటోమేటిక్‌గా ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫుడ్ డెలివరీ యాప్ మాత్రమే కాకుండా ఈ-కేటరింగ్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. https://www.ecatering.irctc.co.in/ ద్వారా లేదా 1323కి కాల్ చేయడం ద్వారా సేవలు పొందవచ్చు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications