ప్రయివేటు సంస్థల్లో పని చేస్తూ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈ ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో ఇక ఎక్కువ పెన్షన్ రానుంది! ఇందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది! రిటైర్డ్ ఉద్యోగులకు వారి చివరి పూర్తి వేతనం ప్రాతిపదికన పూర్తి పింఛన్ ఇవ్వాలని గతంలో కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై ఈపీఎఫ్ఓ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కానీ ఈ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ప్రయివేటు రంగ ఉద్యోగులకు అధిక పెన్షన్ అందనుంది.

ఉద్యోగులకు గుడ్ న్యూస్
ప్రయివేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగుల వేతనం నుంచి కొంత మొత్తం ప్రతి నెల ఈపీఎఫ్ఓలో డబ్బులు జమ అవుతాయి. ఆయా కంపెనీలు కూడా అంతేమొత్తం ఉద్యోగి ఖాతాలో వేస్తుంది. ప్రస్తుత సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈపీఎఫ్ఓలో డబ్బులు జమ అయ్యే ఉద్యోగులు రిటైర్ అయ్యే సమయానికి అధిక పెన్షన్ దక్కనుంది. ప్రస్తుతం ప్రయివేటు ఉద్యోగులకు ఈపీఎఫ్ అర్హత కోసం గరిష్ట వేతనం రూ.15,000 పరిధిని విధించారు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కూడా ఇదే ప్రాతిపదికన చెల్లిస్తోంది. ఇది సరికాదని, ఆఖరి వేతనాన్ని కూడా పరిగణలోకి తీసుకొని పెన్షన్ ఇవ్వాలని గతంలో కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని ఈపీఎఫ్ఓ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కేరళ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. సీజే రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల నేతృత్వంలోని ధర్మాసనం దీనిని తోసిపుచ్చింది.

అయిదేళ్ల క్రితం సవరణలు
రూ.15,000 (గరిష్ట పరిమితి) కన్నా ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎఫ్ఓకు అర్హులు కాదని ఉద్యోగుల పింఛన్ పథకంలో ఈపీఎఫ్ఓ 2014లో సవరణలు చేసింది. ఈ సవరణలపై ఉద్యోగులు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది ఈ సవరణలను హైకోర్టు రద్దు చేసింది. రిటైర్ సమయంలోని ఉద్యోగి చివరి వేతనాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. దీనిని ఈపీఎఫ్ఓ... సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను కొట్టి వేయడంతో కేరళ హైకోర్టు తీర్పు అమలు కానుంది.

ఉద్యోగుల పింఛన్ స్కీం
రూ.15,000 ప్రాతిపదికగా తీసుకొని పెన్షన్ ఇస్తున్నారు. 1995 ఉద్యోగుల పింఛన్ పథకాన్ని (ఈపీఎస్) ప్రారంభించారు. ఉద్యోగుల జీతం నుంచి 8.33 శాతం పెన్షన్ స్కీంకు జమ చేస్తున్నారు. ఈ వాటాను 6,500లో 8.33 శాతానికి పరిమితం చేశారు. అంటే ఉద్యోగుల పెన్షన్ అకౌంట్‌కు రూ.541 జమ అవుతాయి. 2014లో నిబంధనలు సవరించారు. దీని ప్రకారం గరిష్టంగా 15,000 ప్రాతిపదికగా తీసుకొని 8.33 శాతం.. అంటే నెలకు రూ.1,250 ఈపీఎఫ్‌కు జమ అవుతాయి. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. పూర్తి శాలరీపై పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే గత అయిదేళ్ల వేతనం సగటు ప్రాతిపదికన పెన్షన్ ఉంటుందని తెలిపింది. గత ఏడాది వేతనం సగటు ప్రాతిపదికిన తీసుకోబోమని తెలిపింది. ఇది కోర్టు మెట్లకు ఎక్కింది. కాగా, ఉద్యోగుల వేతనంలో పన్నెండు శాతం ఈపీఎఫ్‌కు జమ అవుతాయి. సంస్థలు కూడా అంతే మొత్తం జమ చేస్తాయి. ఇందులో 3.67 ఈపీఎఫ్‍కు, 8.33 శాతం ఈపీఎస్‌కు జమ అవుతుంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications