రూ.5 పెరిగిన నాన్ సబ్సిడీ వంట గ్యాస్, ఏటీఎఫ్ ధర రూ.677 హైక్, పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే

రాయితీలేని వంట గ్యాస్ ధరను, విమాన ఇంధన ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర ఒక శాతం పెరిగింది. దీని ధర రూ.677.1/కిలో లీటర్‌కు పెరిగింది. పెరిగిన శాతం 1.07. ఇప్పుడు దీని ధర దేశ రాజధాని న్యూఢిల్లీలో రూ.63,472.22గా ఉంది. అదే సమయంలో 14.2 కిలోల బరువు ఉండే నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.5కు పెంచుతున్నట్లు ఓఎంసీలు తెలిపాయి.

దీంతో వంట గ్యాస్ ధర రూ.706.50కి (సబ్సిడీ లేని) చేరింది. ప్రస్తుతం ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ ఇస్తున్నారు. ఆ పరిమితి దాటితే ఆధికంగా వెచ్చిస్తూ మార్కెట్ ధరకు సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సబ్సిడీ సిలిండర్ ధరలో మాత్రం మార్పు లేదు. ఢిల్లీలో సబ్సిడీ ద్వారా తీసుకునే వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.495.86గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం ఈ మార్పులు చేసినట్లు చమురు రంగ సంస్థలు వెల్లడించాయి.

Aviation Fuel Price Hiked By Over 1%; Non-Subsidised LPG Dearer By Rs 5

అంతకుముందు మార్చి 1వ తేదీన ఏటీఎఫ్ ధర రూ.4,734.15, నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.42.5 చొప్పున పెరిగింది. ఈ కేలండర్ ఇయర్‌లో గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండోసారి.

ప్రతి నెల ఒకటో తారీఖున ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలను చమురు కంపెనీలు సవరిస్తున్నాయి. విదేశీ మారకం రేటు, అంతర్జాతీయ మార్కెట్‌లో సగటు ఇంధన రేట్ల ఆధారంగా ఈ సవరణలు జరుగుతున్నాయి. మరోవైపు చౌక ధరల దుకాణాల (పీడీఎస్) ద్వారా విక్రయించే లీటర్ కిరోసిన్ ధర కూడా స్వల్పంగా రూ.32.24 నుంచి రూ.32.54కు పెరిగింది. నాన్ సబ్సిడీ కిరోసిన్ ధర ఢిల్లీలో లీటర్‌కు రూ.64.46గా ఉంది.

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ సోమవారం స్వల్పంగా తగ్గాయి. మంగళవారం అవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.72.86, డీజిల్ రూ.66.09గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.78.43, డీజిల్ రూ.69.17, చెన్నైలో పెట్రోల్ రూ.75.63, డీజిల్ రూ.69.78గా, కోల్‌కతాలో పెట్రోల్ రూ.74.88, డీజిల్ రూ.67.83 పైసలుగా ఉంది. సోమవారం వీటి ధరలు 5 పైసల నుంచి 9 పైసల వరకు తగ్గింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.77.26, డీజిల్ రూ.71.81గా, అమరావతిలో పెట్రోల్ రూ.76.98, డీజిల్ రూ.71.19గా, విజయవాడలో పెట్రోల్ రూ.76.61, డీజిల్ రూ.70.85గా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+