మెట్రో రైలు.. రైలు.. ఆర్టీసీ బస్సు.. ఎంఎంటీఎస్.. ఆటోలు.. క్యాబ్‌లు ఇలా ఎందులో ప్రయాణించాలన్నా వేర్వేరుగా డబ్బులు చెల్లించి టిక్కెట్ కొనుగోలు చేయాలి. రద్దీ నగరాల్లో ఎంతోమందికి ఇది ఇబ్బందికరంగా మారింది. కొన్ని సమయాల్లో టిక్కెట్ తీసుకునే సమయం దొరకదు. బస్సుల్లో ప్రయాణించే సమయంలో టిక్కెట్ తీసుకోవాలంటే కండక్టర్ మన వద్దకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత రద్దీ ఉంటుంది. ఈ సమస్యలన్నింటికి హైదరాబాద్‌లో చెక్ పడనుంది.
ప్రయాణీకులకు ఉమ్మడి కార్డు (కామన్ మొబిలిటీ కార్డు) జారీ చేసే ఆలోచనలో ఉంది. మెట్రో రైలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లలో రవాణాకు ప్రయాణికుల సౌకర్యార్థం కామన్ మొబిలిటీ కార్డును అందించేందుకు ఏజెన్సీని ఎంపిక చేయడం కోసం ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‍కే జోషి ఇటీవల అధికారులను ఆదేశించారు.

నాలుగు రోజుల క్రితం కామన్ మొబిలిటీ కార్డులపై సెక్రటరియేట్‌లో సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొబిలిటీ కార్డు రవాణాతో పాటు ఇతర అవసరాలకు కూడా ఉపయోగపడేలా ఉండాలని చెప్పారు. క్యూఆర్ కోడ్, స్వైపింగ్ తదితర ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టం ఉండాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సిఫార్స్ చేసిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు, ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)పై ఆయన చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న పద్ధతులు, భవిష్యత్తు టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని కార్డును రూపొందించేలా బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
ఈ సమావేశంలో అధికారులతో పాటు ఓలా, ఉబేర్, ఆటో యూనియన్లు, సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాదు నగరంలో మెట్రో, రైలు, ఆర్టీసీ తదితర వాహనాల్లో ఒకే కార్డుతో ప్రయాణించేలా సులభతరం చేయనున్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications