మార్చి నెలలో జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో రూ.1.06 ట్రిలియన్లుగా ఉంది. ఇది గత నెల ఫిబ్రవరిలో 92,247 కోట్లుగా ఉంది. 2019 మార్చి నెలలో మొత్తంగా వసూలైన జీఎస్టీ కలెక్షన్లు అక్షరాలా రూ.1,06,577 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.20,353 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.27,520 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.50,418 కోట్లు. సెస్ రూ.8,282 కోట్లుగా ఉంది.
మార్చి 2018 కలెక్షన్లతో పోలిస్తే మార్చి 2019లో వచ్చిన కలెక్షన్లు 15.6 శాతం ఎక్కువ. గత ఏడాది జీఎస్టీ కలెక్షన్లు రూ.92,167 కోట్లు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ కలెక్షన్లు సరాసరిగా రూ.98,114 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఏడాది కంటే 9.2 శాతం ఎక్కువ.

2019 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. 2018 ఏప్రిల్‌లో రూ.1.03 ట్రిలియన్లు, మే నెలలో రూ.94,016 కోట్లు, జూన్ నెలలో రూ.95,610 కోట్లు, జూలై నెలలో రూ.96,483 కోట్లు, ఆగస్ట్ నెలలో రూ.93,960 కోట్లు, సెప్టెంబర్ నెలలో రూ.94,442 కోట్లు, అక్టోబర్ నెలలో రూ.1,00,710 కోట్లు, నవంబర్ నెలలో రూ.97,637 కోట్లు, డిసెంబర్ నెలలో రూ.94,725 కోట్లు, జనవరి-2019లో రూ.1.02 ట్రిలియన్లు, ఫిబ్రవరిలో రూ.97,247 కోట్లు, మార్చి నెలలో రూ.1.06 ట్రిలియన్లు.


Click it and Unblock the Notifications