విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయ్యాయి. ఇది ఏప్రిల్ 1 (నేటి నుంచి) అమలులోకి వస్తోంది. ఈ విలీనంతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మూడో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించింది. భవిష్యత్తులో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లు బీవోబీ శాఖలుగా పని చేస్తాయి. ఈ బ్యాంకుల కస్టమర్లను కూడా బీవోబీ కస్టమర్లుగానే పరిగణిస్తారు. ఈ విషయాన్ని మార్చి 30వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఈ విలీనం సాఫీగా ఉండేందుకు బీవోబీలో 5,042 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విజయా, దేనా బ్యాంకులకు బీవోబీ షేర్లు ఎన్ని వస్తాయంటే?
విజయా బ్యాంక్, దేనా బ్యాంకు శాఖలన్నీ కూడా ఏప్రిల్ 1వతేదీ నుంచి బీవోబీ శాఖలుగా పని చేయనున్నాయని, ఈ బ్యాంకుల ఖాతాదారులను కూడా బీవోబీ ఖాతాదారులుగా పరిణించడం జరుగుతుందని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. విలీన ప్రతిపాదన ప్రకారం విజయా బ్యాంక్ షేర్ హోల్డర్ల దగ్గర ఉన్న ప్రతి 1,000 షేర్లకుగాను బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. దేనా బ్యాంక్ షేర్ హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు గాను బీవోబీ షేర్లు 110 లభిస్తాయి. ఈ మూడింటి విలీనంతో దేశీయంగా ప్రభుత్వంరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రయివేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు తర్వాత మూడో అతిపెద్ద బ్యాంకుగా బీవోబీ ఏర్పడింది.

బ్యాంకింగ్ సంస్కరణలు
ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఈ బ్యాంకుల విలీనం అంశాన్ని వెల్లడించింది. మూడు బ్యాంకుల సంయుక్త వ్యాపారం విలువ రూ.14.82 లక్షల కోట్లుగా నిర్ణయించారు. నికర మొండి బాకీల నిష్పత్తి 5.71 శాతంగా ఉంటుంది. ఈ విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 21 నుంచి 19కి తగ్గుతుంది. బ్యాంకింగ్ సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. దీంతోపాటు ఇప్పటికే పీఎస్‌బీల్లో ప్రభుత్వం రూ.1.06లక్షల కోట్ల మేరకు మూలధనాన్ని సమకూర్చింది.

ఎక్కువ బ్యాంకులు కలిగిన రెండో బ్యాంక్ బీవోబీ
బీవోబీలో దేనా, విజయా బ్యాంకులు విలీనం అవడంతో దేశంలో ఎక్కువ బ్యాంకులు ఉన్న బ్యాంకుగా బీవోబీ రెండో స్థానంలో ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాంకుల సంఖ్య దేశంలో 9,500కు చేరుకుంటుంది. అయితే, పలు కారణాల వల్ల కొన్ని శాఖలను క్లోజ్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. విలీనమైన బ్యాంకులతో కలుపుకుంటే బీవోబీ అడ్వాన్సెస్ అండ్ డిపాజిట్ మార్కెట్ షేర్లు వరుసగా 6.9 శాతంగా, 7.4 శాతంగా ఉంటుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications