For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెంపుడు కుక్కకు కోసం బెయిల్ ఇవ్వండి!: బ్రిటన్ కోర్టుకు నీరవ్ మోడీ లాయర్లు

|

బ్రిటన్‌లో అరెస్టైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని బెయిల్ మీద తీసుకు వచ్చేందుకు ఆయన తరఫు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఎన్నో సాకులు చూపించారు. కానీ జడ్జి మాత్రం బెయిల్ ఇవ్వలేదు. నీరవ్ తరఫున బారిస్టర్ క్లార్ మాంట్‌గోమ్రి వాదించారు. జడ్జిని ఒప్పించేందుకునీరవ్ మోడీ లాయర్ల బృందం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది.

<strong>ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ధరలు పెరుగుతాయి, ఇవి తగ్గుతాయి!</strong>ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ధరలు పెరుగుతాయి, ఇవి తగ్గుతాయి!

 కుక్క కోసం బెయిల్ ఇవ్వండి!

కుక్క కోసం బెయిల్ ఇవ్వండి!

నీరవ్ మోడీ తనయుడు చార్టర్ హౌస్‌లో ఉన్నాడని, ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్లవలసి ఉందని, దీంతో పాటు ముసలి తల్లిదండ్రుల బాధ్యత కూడా అతనిపై ఉందని, ఆయన తన కుక్క సంరక్షణను కూడా చూసుకోవాల్సి ఉందని, కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వాలని, ఇన్ని బాధ్యతలు ఉండగా ఆయన పారిపోతాడని చెప్పడం సరికాదని, ఆయన ఎక్కడకు వెళ్లేందుకు కానీ, ఇతర చోట్ల ఉండేందుకు కానీ దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. ఈ వాదనను భారత్ తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ కొట్టిపారేసింది. నీరవ్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని అభ్యంతరం వ్యక్తం చేసింది. నీరవ్ అక్కడి ప్రత్యక్ష సాక్షిని చంపుతానని భయపెట్టాడని, లంచం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశారని కూడా చెప్పింది. ఈ వాదనతో ఏకీభవించిన జడ్జి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. అనంతరం కేసును వచ్చే నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

 ఒకే జైలులో ఉంచుతారా?

ఒకే జైలులో ఉంచుతారా?

భారత్‌కు అప్పగిస్తే నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలను జైల్లోని ఒకే గదిలో ఉంచుతారా? అని ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నించారు బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజ్రిస్ట్రేట్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ న్యాయమూర్తి గత ఏడాది డిసెంబర్‌లో విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ హోంశాఖను ఆదేశించింది. దీనిని గుర్తు చేసుకుంటూ... ఇప్పుడు నీరవ్‌ను అప్పగిస్తే మాల్యాతో కలిపి ముంబైలోని అదే ఆర్థర్ రోడ్డు జైల్లో ఒకే సెల్‌లో ఉంచుతారా అని అడిగారు. మాల్యాను కట్టుదిట్టమైన భద్రత, అన్ని సౌకర్యాలున్న ఆర్థర్ రోడ్డు జైలులో విచారణ ఖైదీగా ఉంచుతామని కోర్టుకు భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.

 ఆధారాలతో బ్రిటన్‌కు భారత్

ఆధారాలతో బ్రిటన్‌కు భారత్

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో నీరవ్ మోడీని ఈ నెల 20వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నీరవ్ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశాడని తెలిపే ఆధారాలను వెంట తీసుకొని ఈడీ, సీబీఐ ఉన్నతాధికారుల బృందం ఈ నెల 28వ తేదీన లండన్ బయలుదేరి వెళ్లింది. ఈ ఆధారాలను కోర్టు ముందు ఉంచింది.

Read more about: nirav modi
English summary

పెంపుడు కుక్కకు కోసం బెయిల్ ఇవ్వండి!: బ్రిటన్ కోర్టుకు నీరవ్ మోడీ లాయర్లు | Nirav Modi's defence team even uses his pet dog in attempt to win bail

Fugitive diamond merchant Nirav Modi failed in his second attempt to get bail in his extradition case at Westminster Magistrates’ Court here despite his defence team vehemently trying to establish his close ties to the UK, including having to care for a pet dog.
Story first published: Sunday, March 31, 2019, 15:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X