ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తోంది ? ఫిక్సెడ్ డిపాజిట్ చేసే ముందు ఇవి చూడండి
బ్యాంకుల వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు కొద్దో గొప్పో మారుతూ ఉంటాయి. చాలా మంది వీటిని పెద్దగా పట్టించుకోరు. కానీ హోసింగ్ లోన్ తీసుకున్న వాళ్లకు మాత్రం నెలనెలా ఈఎంఐలో మార్పులు ఉంటాయి కాబట్టి చూసుకుంటారు. త్వరలో ఆర్బీఐ తన వడ్డీ రేట్లను మార్చే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్.డి. వడ్డీ రేట్లు
సమయం వడ్డీ శాతం
7-45 రోజులకు 5.75 శాతం
46-179 రోజులు 6.25 శాతం
180-210 రోజులు 6.35 శాతం
211-ఏడాదిలోపు 6.4 శాతం
1-2 ఏళ్లు 6.8 శాతం
2-3 ఏళ్లు 6.8 శాతం
3-5 ఏళ్లు 6.8 శాతం
5-10 ఏళ్లు 6.85 శాతం
వీటిల్లో సీనియర్ సిటిజన్లకు అన్నింటిపైనా అర శాతం వడ్డీ ఎక్కువగా లభిస్తుంది.

ఏడాదిలోపు ఉంటే షార్ట్ టర్మ్ ఫిక్సెడ్ డిపాజిట్లకు ఎస్బీఐ 5.75 - 6.4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
ఎఫ్.డి.లకు ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్తున్న వడ్డీ రేట్లు
7 - 45 రోజులకు 5.5 శాతం
46 - 184 రోజులకు 6.25 శాతం
185 - 289 రోజులకు 6.50 శాతం
290 - 364 రోజులకు 6.40 శాతం
2-3 ఏళ్లకు 7.50 శాతం
3-5 ఏళ్లకు 7.25 శాతం
5-10 ఏళ్లకు 7 శాతం
ఎఫ్.డి.లకు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఇస్తున్న వడ్డీ రేట్
7-90 రోజులకు 6.25 శాతం
91 - 364 రోజులకు 7.30 శాతం
1-2 ఏళ్ల లోపు 7.40 శాతం
2 - 3 ఏళ్ల లోపు 7.40 శాతం
3 - 5 ఏళ్ల లోపు 7.25 శాతం
3- 5 ఏళ్ల లోపు 6.50 శాతం


Click it and Unblock the Notifications