ఆర్థికంగా పరిపుష్టం కావడానికి, భవిష్యత్ అవసరాలకు డబ్బు ఎంతో అవసరం. అందుకే చిన్న వయస్సు నుంచే ఎంతో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెడ్తూ ఉంటాం. అయితే ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో మాత్రం కొన్ని తప్పులు మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆర్థికంగా మనం మన టార్గెట్‌ను అందుకోలేకపోగా.. ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి. అందుకే ఈ తప్పులను అవాయిడ్ చేస్తే మనకు తిరుగు ఉండదు. అది బంగారంలో పెట్టుబడైనా లేక గోల్డ్ కొన్నా, స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టినా, మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకున్నా.. ఈ పొరపాట్లను మాత్రం చేయొద్దు.

గత చరిత్ర చూసి మోసపోవద్దు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఇదే. గతే ఏడాది ఒక ఫండ్ 30 శాతం లాభాలను అందించిందని అనుకుందాం. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో అంత రాబడిన ఆశించడం మాత్రం సరైంది కాదు. ఎవరైనా పాత పర్ఫార్మెన్స్‌ను చూపించి పెట్టుబడి పెట్టమంటే మాత్రం నమ్మొద్దు. మీరు ప్రధానంగా చూడాల్సింది సదరు మ్యూచువల్ ఫండ్ స్కీం ఏంటి, ఫండ్ మేనేజర్ లక్ష్యమేంటి, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ గత చరిత్ర వంటివి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక థిమాటిక్ ఫండ్స్ ఎంపిక చేసుకునేముందు ఎక్కువ కాలాన్ని పెట్టుబడికి ఎంచుకోవాల్సి ఉంటుంది. కనీసం 5 ఏళ్ల సమయాన్నైనా ఎంచుకోవాలి.

ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ వద్దు
మీరు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం నిజంగా మంచి నిర్ణయం. భవిష్యత్‌లో పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది మంచి సాధనం. అయితే 10-20 మ్యూచువల్ ఫండ్స్ ఎంపిక చేసుకోవడం మాత్రం సరైంది కాదు. వాస్తవానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ స్టాక్స్‌లోనే పెట్టుబడి పెడ్తాయి. మీరు ఇన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే దాదాపు కొన్ని స్టాక్స్‌కై మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను మళ్లించినట్టు అవుతుంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్ కంటే పెద్ద గొప్ప రాబడి ఏమీ రాకపోవచ్చు. అందుకే ఒకరి పోర్ట్‌ఫోలియోను 6 ఫండ్స్‌కు మించి పెట్టుబడి పెట్టొద్దు. ఈ ఆరు ఫండ్స్‌లో ఈక్విటీ, డెట్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అన్నీ కలిపే అని గుర్తుంచుకోండి.

పెన్నీ స్టాక్స్ కోసం పరుగులొద్దు
పెన్నీ స్టాక్స్ అంటే మనలో చాలా మందికి మహా ఇష్టం. ఒక స్టాక్ రూ.20-30 లోపు ఉంటే ఎగబడి కొనేందుకు చాలా మంది సంసిద్ధంగా ఉంటారు. స్టాక్ మార్కెట్‌పై కొద్దో గొప్పో అవగాహన ఉన్న వాళ్లు ఖచ్చితంగా వీటి గురించి వింటారు, డబ్బులు పెడ్తారు, పోగొట్టుకుంటారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. అందుకే కాఫీ టేబుళ్ల దగ్గరో, లంచ్ సమయాల్లోనో వచ్చే స్టాక్ టిప్స్‌ను ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేముందు మనం చూడాల్సింది వాటి ఫండమెంటల్స్. సంస్థ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, డెట్ - ఈక్విటీ రేషియో, డివిడెండ్, మేనేజ్‌మెంట్ క్వాలిటీ వంటివి చూడాల్సి ఉంటుంది. అందుకే స్టాక్స్‌లో పెట్టుబడికి ముందు రీసెర్చ్ చేయండి.

తగ్గినప్పుడు కొందాం
ఇన్వెస్టర్లలో అధిక శాతం చేసే తప్పు ఇదే. తగ్గినప్పుడు కొందాం అని వేచి చూసే ధోరణే మనలో చాలా మంది చేసే అతి పెద్ద తప్పు. ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఓ లాంగ్ టర్మ్ కమిట్‌మెంట్. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిని మనం బెస్ట్ టైంను చూడలేం. అది ఎవ్వరి వల్లా సాధ్యమయ్యే పనైతే కాదు. ఎందుకంటే ఇది సైకిల్స్‌లో ముందుకు సాగుతూ ఉంటుంది. మన లక్ష్యమేంటి, అందుకు తగ్గట్లు ఎలాంటి ప్రణాళికను చేసుకుంటున్నాం అని చూసుకోవాలి కానీ మార్కెట్ పడినప్పుడు కొందాం, పెరిగినప్పుడు అమ్ముదాం అంటే మాత్రం సాధ్యమయ్యే పనికాదు. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో భాగంగా ఈ నాలుగు అంశాలనూ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications