బీజింగ్/హైదరాబాద్ : ప్రతి విషయంలో ఎప్పుడూ ముందుండే అమెరికాను తాజాగా డ్రాగన్ చైనా వెనక్కి నెట్టేసింది. ప్రపంచంలోనే 5జీ సేవలను వినియోగిస్తున్న తొలి జిల్లాగా షాంఘై రికార్డు సృష్టించింది. దీంతో ప్రస్తుతం 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టి చైనా ముందడుగు వేసినట్లైంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారిక పత్రిక చైనా డైలీలో తన కథనంలో పేర్కొంది. 'ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ చైనా మొబైల్ 5జీ నెట్ వర్క్ ట్రయల్ రన్‌ను అధికారికంగా షాంఘై జిల్లాలో శనివారం నుంచి ప్రారంభించింది.

గత మూడు నెలల కాలంలో షాంఘైలోని వివిధ చోట్ల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా మొత్తం 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చినట్లైంది' అని చైనా డైలీ తెలిపింది. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా షాంఘై వైస్ మేయర్ వూ క్వింగ్.. ప్రపంచంలోనే తొలి 5జీ ఫోల్డబుల్ ఫోన్ అయిన హువాయ్ మేట్ ఎక్స్ నుంచి తొలి 5జీ వీడియోకాల్‌ను చేశారు. వినియోగదారులు తమ సిమ్ కార్డులను అప్‌గ్రేడ్ చేసుకోకుండానే ఈ సేవలను పొందవచ్చని తెలిపారు.
More From GoodReturns

Green card: పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు.. అమెరికా వీసా రూల్స్‌లో ఈ తేడా ఎందుకు?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు.. హార్ముజ్ జలసంధి నుంచి నిరంతరంగా చమురు సరఫరా..

రష్యా చమురు కొనాలని ప్రపంచ దేశాలను ట్రంప్ అడుక్కుంటున్నారు.. అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్..

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

ఇరాన్ యుద్ధం వేళ మరో టెన్షన్.. జపాన్ తూర్పు తీరం వైపు 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కిమ్..

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..



Click it and Unblock the Notifications