రోజు సాధరణ కార్లలో తిరిగి బోరుకొడుతుందా ?రోజుకో కారును డ్రైవ్ చేయాలనే ఆలోచన ఉందా, అయితే మీ కోసమే మూములు నానో కారు నుండి కోటి రుపాయాల ఆడీ కారు సైతం వేచి ఉంది, రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు రెంటుకు తీసుకునే వెసులుబాటు హైద్రబాద్ లో లభిస్తుది,అంతేకాదు నచ్చితే ఆకారు కొనుగోలు చేసే అవకాశం కూడ ఇవ్వనున్నారు.వీటితోపాటు సూపర్ ప్రీమియం బైక్ లుగా అద్దెకు లభించనున్నాయి.

పెరుగుతున్న లగ్జరీ కార్ల సబ్‌స్క్రిప్షన్
మెట్రో నగరాల్లో ప్రయాణించాలంటే టూ వీలర్ లేదా కారు ఖచ్చితంగా ఉండాలి, హైద్రబాద్ తో పాటు ఏ నగరంలోనైన జర్నికి ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికే పలు క్యాబ్ సంస్థలు డెయిలి రెంట్ కు తిప్పుతున్నాయి. అయితే ఇవి మనకు కేవలం పిక్ అండ్ డ్రాప్ గా నే పని చేస్తున్నాయి ,మరో వైపు నగరాల్లో ఏదైన పని కోసం వస్తున్నవారికి సరైన కార్ల సౌకర్యం ఉండదు, రోజంతా టాక్సి పట్టుకుని తిరగాల్సి ఉంటుంది.దీంతో ఉన్నత స్థానాల్లో ఉన్నవారితో పాటు వ్యాపారపరంగా ప్రయాణం చేసే పలువురికి ఇది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది.దీనికి తోడు కోద్ది రోజుల అవసరానికి కారు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవడం కూడ అనవసర పెట్టుబడి క్రిందకి వస్తుంది. మరో వైపు తమ కారును పక్కన పెట్టి ఓసారి సూపర్ ప్రీమియం లగ్జరీ కార్లలో ప్రయాణించాలనే కోరిక సాధారణంగా ప్రయాణికులకు ఉంటుంది. ఈనేపథ్యంలో వ్యక్తిగతంగా కార్లను రెంట్ కు ఇచ్చేందుకు సిద్దమైంది కార్‌టూడ్రైవ్ అనే సంస్థ, ప్రస్తుతం బెంగుళూర్ ,చెన్నైలలో ఇలాంటీ సెవలను అందిస్తున్న సంస్థ హైద్రబాద్ లో తన సేవలను ప్రారంభించింది.

నానో నుండి ఆడీ వరకు రెంట్
కాగా కార్‌టూడ్రైవ్ నిర్వాహకులు చెబుతున్న సమాచారం ప్రకారం నానో కారునుండి ప్రీమియం ,సూపర్ ప్రీమియం కారైన ఆడీ, వంటి కార్ల వరకు ఇందులో రెంట్ కు ఇవ్వనున్నట్టు తెలిపారు.కార్లను రెండు గంటల సమయం నుండి మూడు లేదా నాలుగేళ్ల. వరకు కూడ అద్దేకు తీసుకోవచ్చని తెలిపారు.అయితే రూ.కోటి కంటే ఎక్కువ విలువ కల్గిన కార్లనే ఎక్కువగా రెంటుకు ఇచ్చేందుకు వారు ప్రిపేర్ అవుతున్నారు. కాగా వీటీ కిరాయి ఒక్కరోజుకు పదివేల రుపాయాలు ఉంటుందని చెప్పారు.

ఇష్టపడితే కొనుక్కోవచ్చు
కాగా రోజువారిగా కాకుండా ఎక్కువ రోజులకు సబ్‌స్ర్కిష్సన్ గా తీసుకుంటే తక్కువ ధర ఉంటుందని చెప్పారు, ఈనేపథ్యంలోనే సుమారు 3000 కార్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.కాగా వీటిని నెల నుండి నాలుగు సంవత్సరాల వరకు కూడ నుడుపుకోవచ్చు,ఇందుకోసం కంపనీయో సర్వీసు తోపాటు మెయింటెనెన్స్ కంపనీయో భరించనుంది.కాగా కస్టమర్లకు తమకు ఇష్టంవచ్చినట్టు కారును కస్టమైజేషన్ చేసి కూడ ఇవ్వనున్నారు. మరోవైపు కారును వాడుకున్న తర్వాత అది తమకు ఇష్టంగా అనిపిస్తే దాన్ని కోనుగోలు చేసుకునే అవకాశం కూడ కల్పించారు,దీంతో వారికి మార్కేట్ ధరను బట్టి అమ్మేందుకు సిద్దమయ్యారు నిర్వాహకులు

పదిలక్షల విలువగల బైకులు కూడ కిరాయకు
ఇక కార్లతో పాటు సూపర్ ప్రీమీయం బైక్ లను కూడ అందుబాటులోకి తీసుకువచ్చింది సదరు సంస్థ. పది లక్షల కంటే ఎక్కవ విలువ గల 500 సీసీ పైబడిన లగ్జరీ బైక్ లు,55 మోడల్స్ కు పైగా కిరాయికి అందుబాటులో ఉన్నాయి.
సో ఇంకేందుకు ఆలస్యం,రోజు వారి అవసరాలతోపాటు , ఎలాగు లక్షలు ,కోట్లు పెట్టి స్వంతగా బైకులు ,కార్లు కొనలేని వారు ఓ సారి కిరాయి కార్లలో రైడ్ చేసుకునే అవకాశం వచ్చింది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications