29 మార్చి 2019 నుంచి ప్రభుత్వ రంగానికి చెందిన రైల్ వికాస్ నిగమ్ పబ్లిక్ ఆఫర్ ప్రారంభమైంది. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా దీనిని చేపట్టారు. ఇప్పటికే ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి గాను నిర్దేశించిన లక్ష్యంలో రూ.80 వేల కోట్లను దాటింది. యస్ సెక్యూరిటీస్, ఎలరా కేపిటల్, ఐడీబీఐ కేపిటల్ మార్కెట్ అండ్ సెక్యూరిటీస్‌లు బుక్ రన్నింగ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. అలంకిత్ అసైన్‌మెంట్ రిజిస్ట్రార్‌గా ఉంది. రైల్వేలకు సంబంధించి కీలక ప్రాజెక్టును చూసుకోవడం, ఆర్థిక వనరుల సమీకరణ, రైలు ప్రాజెక్టుల నిర్వహణ, పోర్టులకు అనుసంధానం వంటి అంశాలను పర్యవేక్షించేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్
రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఐపీఓ ఈ రోజు (శుక్రవారం) ప్రారంభమై ఏప్రిల్ 3వ తేదీన ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.481 కోట్ల నిధులను కంపెనీ సమీకరించనుంది. ఒక్కో షేర్ ధరను రూ.17నుంచి19గా నిర్ణయించారు. అధిక వేగంతో ప్రయాణించే రైళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థగా రైల్ వికాస్ నిగమ్‌కు పేరు ఉంది. ఇష్యూలో భాగంగా మొత్తం 25,34,57,280 ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఇందులో 6,57,280 షేర్లను అర్హతగల ఉద్యోగులకు కేటాయిస్తారు. రిటైల్, ఉద్యోగుల సెగ్మెంట్‌లో ఒక్కో షేర్‌కు రూ.0.50 డిస్కౌంట్‌ను ప్రకటించింది. రైల్ వికాస్ నిగమ్ ప్రభుత్వ రంగానికి చెందిన మినీరత్న కంపెనీ. ఇష్యూ తర్వాత ఈక్విటీ షేర్లు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవుతాయి.

మేజర్ ప్రాజెక్టులు
రైల్ వికాస్ నిగమ్ (ఆర్వీఎన్ఎల్) ప్రభుత్వ రంగ కంపెనీ. రైల్ ప్రాజెక్టు అభివృద్ధి, ఆర్థిక వనరుల సమీకరణ, రైల్ ప్రాజెక్టుల అమలు, పోర్ట్ కనెక్టివిటీ, ప్రాజెక్టుల కోసం అదనపు బడ్జెట్ వనరులు సమకూర్చడం వంటివి చేస్తుంది. దీనిని ప్రాజెక్టుల అమలుకు పరిమితం చేయాలని 2004లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వే శాఖ నిర్ణయించింది. కొత్త లైన్లు, డబ్లింగ్, గాగ్ కన్వెర్షన్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, మెట్రో ప్రాజెక్టులు, వర్క్‌షాప్స్, మేజర్ బ్రిడ్జిలు, ఇన్‌స్టిట్యూషన్ వంటి ప్రాజెక్టులను ఇది నిర్వహిస్తోంది. బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లను సంప్రదించిన తర్వాత రైల్ వికాస్ నిగమ్ ఒక్కో షేర్‌ను రూ.17 నుంచి రూ.19గా నిర్ణయించింది. ఈ షేర్లు ఈ రోజు ప్రారంభమై ఏప్రిల్ 3న ముగుస్తాయి.

ఈక్విటీ షేర్లు జారీ
మొత్తం 25,34,57,280 ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఇందులో 6,57,280 అర్హత కలిగిన ఉద్యోగులకు కేటాయిస్తారు. నెట్ పబ్లిక్ ఆఫర్ 25,28,00,000గా ఉంటుంది. రూ.17 షేర్ వద్ద ప్రభుత్వం రూ.430.88 కోట్లు, రూ.19 షేర్ వద్ద ప్రభుత్వం రూ.481.57 కోట్లు సమీకరించనుంది. ఈ ఆపరేషన్స్ ద్వారా ఆర్వీఎన్ఎల్ రెవెన్యూ 2016లో 4,539.85 కోట్ల ఉండగా, 2018 ఆర్థిక సంవత్సరానికి 7,597.36 కోట్లకు పెరిగింది. నెట్ ప్రాఫిట్ 15.20శాతం పెరిగింది. 2016 ఆర్థిక సంవత్సరంలో 429.43 కోట్ల నుంచి 2018 ఆర్థిక సంవత్సరానికి 569.92 కోట్లకు పెరిగింది. ఆర్వీఎన్ఎల్ 31 డిసెంబర్ 2018 నాటికి 102 ప్రాజెక్టులతో 77,504.28 ఆర్డర్స్ కలిగి ఉంది. 2003లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 179 ప్రాజెక్టులను ఆర్వీఎన్ఎల్‌కు ట్రాన్సుఫర్ చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications