ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఒక్కరోజులోనే రూ.1 కోటి వరకు హోంలోన్

భారతదేశంలో రుణాలిచ్చే రెండో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ. ఇప్పుడు ఇది తమ శాలరైడ్ కస్టమర్లకు ఆన్‌లైన్ ద్వారా గృహ రుణాలు ఇవ్వడం ద్వారా హోంలోన్ మార్కెట్‌లో మరింత అగ్రెసివ్‌గా వెళ్తోంది. తమ కస్టమర్లు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు అదే డిజిటల్ మార్గంలో తక్షణ అప్రూవల్‌ను కూడా తీసుకు వస్తోంది. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంకు రెండు రకాల గృహ రుణాలను ప్రకటించింది.

 రూ.కోటి వరకు హోంలోన్, ఇవి చూశాకే ఇస్తారు

రూ.కోటి వరకు హోంలోన్, ఇవి చూశాకే ఇస్తారు

ఈ మేరకు మార్చి 27వ తేదీన ఐసీఐసీఐ ప్రకటన చేసింది. ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు క్రెడిట్ స్కోర్ ఆధారంగా లక్షల రూపాయల నుంచి రూ.1 కోటి వరకు రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. కస్టమర్ అకౌంట్, క్రెడిట్ బ్యూరో చెక్కులు, శాలరీక్రెడిట్స్, యావరేజ్ బ్యాలెన్స్, రీపేమెంట్ ట్రాక్ వంటి వాటి ఆధారంగా ఈ హోంలోన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిస్టింగ్ హోంలోన్ కస్టమర్లకు కూడా శుభవార్త చెప్పింది. రూ.20 లక్షల వరకు పదేళ్ల పరిమితికి గాను ఇన్‌స్టాంట్ టాపప్ లోన్లు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. దీనికి విభిన్న వడ్డీ రేట్లు ఉండవు.

కస్టమర్ ఖాతాలోకి డబ్బులు

కస్టమర్ ఖాతాలోకి డబ్బులు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు, సత్వరం తుది ఆమోదం కూడా డిజిటల్‌ పద్ధతిలోనే పొందే ఈ రెండు రకాల హోమ్ లోన్లను ఐసీఐసీఐ ప్రకటించింది. ఇందులో 'ఇన్‌స్టాంట్‌ హోమ్‌ లోన్' పథకం కింద ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా కలిగిన, ముందస్తు ఆమోదం పొందిన (ప్రీ అప్రూవ్డ్‌) ఉద్యోగులు ముప్పై ఏళ్ల వ్యవధికి రూ.1 కోటి వరకు గృహ రుణం ఇస్తారు. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకుని డిజిటల్‌ పద్ధతిలో వెంటనే ఈ రుణం పొందే అవకాశముంది. 'ఇన్‌స్టా టాప్ అప్' లోన్ పథకం కింద ఇప్పటికే గృహ రుణం ఉన్న ఖాతాదారులు పదేళ్ల వ్యవధితో రూ.20 లక్షల వరకు అదనపు హోమ్ లోన్ అవకాశం కల్పించింది. కాగితాలతో పని లేకుండా డిజిటల్‌ పద్ధతిలో ఈ రుణాలు పొందవచ్చు. ఈ రుణాలకు సంబంధించిన మొత్తం కస్టమర్ అకౌంట్‌లోకి వస్తాయి.

 బ్యాంకుకు వెళ్లి పత్రాలు సమర్పించాలి

బ్యాంకుకు వెళ్లి పత్రాలు సమర్పించాలి

సాధారణంగా రుణాలు మంజూరు కావడానికి వారం రోజులు లేదా అంతకంటే ఎక్కువ పడుతుంది. కానీ ఈ ప్రక్రియలో ఒక్క క్లిక్‌తో రుణ సౌకర్యం పొందవచ్చు. ఆ తర్వాత కస్టమర్ బ్యాంకు బ్యాంకును సందర్శించి, కాంటాక్ట్ రిలేషన్‌షిప్ మేనేజర్‌ను శాంక్షన్ లెటర్‌తో సంప్రదించాలి. అలాగే, వారు కొనుగోలు చేయాలనుకునే ఇంటికి సంబంధించిన పత్రాలు తీసుకు వెళ్లాలి. ఇన్‌స్టాంట్ సాంక్షన్ కోసం ముందుగానే ప్రాపర్టీ చూపించాల్సిన అవసరం లేదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+