దేశంలోని టాప్ డయాగ్నస్టిక్ సంస్థల్లో ఒకటైన మెట్రోపొలిస్ సంస్థ ఐపీఓ ద్వారా జనాల నుంచి రూ.1204 కోట్లు సమీకరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 3న ప్రారంభం కాబోతున్న ఈ ఇష్యూ ద్వారా 1.36 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టింది ఈ సంస్థ. వీటిలో 62 లక్షల షేర్లు ప్రమోటర్ అయిన సుశీల్‌వి. అలానే మరో 74 లక్షల షేర్లు అమెరికాకు చెందిన కార్లిల్ సంస్థకు చెందిన సీఏ లోటల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌వి.
ఈ ఐపీఓ ద్వారా సమీకరించబోతున్న రూ.1204 కోట్లలో సంస్థకు ఎలాంటి నిధులూ రావు. గతంలో పెట్టుబడి పెట్టిన అమెరికన్ సంస్థకు రూ. 652 కోట్లు, మిగిలిన మొత్తం ప్రమోటర్లు తీసుకోబోతున్నారు. మెట్రోపొలిస్ డయాగ్నస్టిక్స్ ఐపీఓకు రూ.877-880 మధ్య ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా సంస్థ విలువ రూ.4400 కోట్లకు చేరుతుంది.

కార్లిల్ అమితాసక్తి
దేశంలోని వివిధ చైన్ డయాగ్నస్టిక్ సంస్థలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ రంగం కూడా ఆర్గనైజ్డ్‌గా మారుతోంది. ఇప్పటికే థైరోకేర్, లాల్‌ప్యాథ్ ల్యాబ్స్ వంటి సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఇది రాబోయే రోజుల్లో మరింతగా విస్తరించే అవకాశం ఉండడంతో విదేశీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మెట్రోపొలిస్ సంస్థలో గతంలో కార్లిల్ సంస్థ 31.2 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2015లో మాజీ ప్రమోటర్ జిఎస్‌కే వేలు నుంచి కార్లిల్ ఈ వాటాను కొనింది.
ఈ సంస్థను షా కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఛైర్మన్‌గా సుశీల్ షా, అతని కూతురు ఎండిగా అమీరా షా ఉన్నారు. బ్రాండింగ్ సహా వివిధ అంశాలను అమీరా షానే ఎక్కువగా చూసుకుంటున్నారు.
ఆర్థికంగా పటిష్టం
మెట్రోపొలిస్ డయాగ్నస్టిక్స్ సంస్థకు 197 నగరాల్లో కనెక్టివిటీ ఉంది. 115 క్లినికల్ ల్యాబ్స్‌ను నిర్వహిస్తున్న సంస్థకు ముంబైలో గ్లోబల్ రెఫరెన్స్ ల్యాబ్, 14 ప్రాంతాల్లో రీజనల్ రిఫరెన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. వీటికి అదనంగా 56 శాటిలైట్ ల్యాబ్స్, 44 ఎక్స్‌ప్రెస్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. 19 రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంస్థ ప్రధానంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. మార్చి 2018 నాటికి సంస్థ ఆదాయం రూ.651.5 కోట్లు, నికర లాభం రూ.109.70 కోట్లుగా ఉంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications