లాభాల్లో ముగిసిన మార్కెట్లు, బలపడిన రూపాయి
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 11,624 వద్ద, సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 36,673 వద్ద ముగిశాయి. ఈరోజు మార్కెట్లో వేదాంత, టాటా స్టీల్, టాటా మోటార్స్, మహీంద్రా మహీంద్రా లిమిటెడ్, మారుతీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అండ్ యూపీఎల్ వంటి కంపెనీ భారీగా లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం 69.34 వద్ద ముగియగా, ఈ రోజు 11 పైసలు బలపడి 69.23 వద్ద ట్రేడ్ అయింది.
ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ షేరు ఆరు శాతం లాభపడి దాదాపు రూ.577 వద్ద ట్రేడ్ అయింది. శుక్రవారం చమురు ధరలు పెరిగాయి. ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గించడం, ఇరాన్, వెనుజువెలాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈ ధరలు పెరిగాయి.

వాబ్ కో ఇండియా షేర్లు ఎనిమిది శాతం వరకు పెరిగాయి. దీని మాతృసంస్థ వెబ్ కో హోల్డింగ్స్.. జెడ్‌ఎఫ్ ఫ్రైరిచెష్ఫన్ ఏజీతో ఒప్పందానికి రావడంతో షేర్లు ర్యాలీ చేశాయి. జెడ్‌ఎఫ్ సంస్థ దాదాపు 136 మిలియన్ డాలర్లు విలువైన షేర్లను నగదు చెల్లించి కొనుగోలు చేయనుంది.
అత్యంత అరుదైన లోహం పల్లాడియం ధర పతనమైంది. దాదాపు తొమ్మిదేళ్లలో ఎప్పుడూ లేనంతగా తగ్గింది. దీని ధర మూడు రోజులుగా తగ్గుతోంది. కాలుష్యం తగ్గించే పరికరాల్లో పల్లాడియంను ఉపయోగిస్తారు.
ప్రభుత్వ రంగ ఈ-కామర్స్ సంస్థ ఎంఎస్‌టీసీ షేర్లు మార్కెట్లో లిస్టయ్యాయి. కాకపోతే లిస్టైన ధర కేటయింపు ధర కంటే దాదాపు రూ.5 తక్కువగా ఉంది. ఈ షేరు ఇష్యూ ధర రూ.120. కానీ రూ.115కి ఇది నమోదైంది. తొలుత అయితే రూ.111 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అంటే ఇష్యూ ధర కంటే 7.5 శాతం తక్కువ.


Click it and Unblock the Notifications