సామ్‌సంగ్ తన పదో యానివర్సరీ సందర్భంగా ఫోల్డబుల్ (మడతపెట్టే) స్మార్ట్ ఫోన్‌ను తీసుకు వస్తోంది. భారత దేశంలోను ఈ ఫోన్‌ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఈ ఫోన్‌ను ఎక్కువసార్లు ఫోల్డ్ చేస్తే పాడైపోదా అనే అనుమానాలు ఎందరిలోనే ఉన్నాయి. ఈ అనుమానాలను అన్నింటిని సామ్‌సంగ్ నివృత్తి చేసే ప్రయత్నాలు చేసింది.
ఇందులో భాగంగా ఇందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. ఫోల్డబుల్ మొబైల్ ఫోన్‌పై టెస్ట్ నిర్వహించింది. ఈ వీడియో 34 సెకన్ల పాటు ఉంది. 2 లక్షల సార్లు ఈ ఫోన్‌ను మడతపెట్టినా బాగానే పని చేస్తుందని శామ్‌సంగ్ చెప్పే ప్రయత్నం చేసింది.

అంటే రోజుకు వందసార్లు చొప్పున అయిదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఫోన్ ఉపయోగించవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శామ్‌సంగ్ పోల్డబుల్ ఫోన్‌ను ఏప్రిల్ చివరి నాటికి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తోంది. దీని ధర దాదాపు రూ.2వేల డాలర్లు.
ఈ మొబైల్ ఫీచర్స్... 7.3 అంగుళాల డైనమిక్ ఆమోల్డ్ మెయిన్ డిస్‌ప్లే, ఆరు అంగుళాల హెచ్‌డీ ప్లస్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, బ్యాక్ 3 కెమెరాలు 12 (టెలిఫోటో)+12+(వైడ్‌యాంగిల్), 16మెగాపిక్సెల్ (అల్ట్రావైడ్), ఫంట్ర్ డ్యుయల్ కెమెరా 10+8 మెగా పిక్సెల్, ఆండ్రాయిడ్ పై, 4380 ఎంఏహెచ్ బ్యాటరీ.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications