మళ్లీ అదుర్స్! ఎక్స్‌పైరీ రోజున ఎగిరి గంతేసిన సెన్సెక్స్

మార్చ్ ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీ ముగింపు నేపధ్యంలో షార్ట్ కవరింగ్ మార్కెట్లను పరుగులు తీయించింది. బ్యాంక్ నిఫ్టీ మరో సరికొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. మెటల్ మినహా అన్ని రంగాల షేర్లూ లాభాలను నమోదు చేశాయి. మొత్తానికి మార్చి సిరీస్‌లో నిఫ్టీ, సెన్సెక్స్‌లు 7 శాతానికి పైగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉన్నా మన మార్కెట్లు మాత్రం ఎక్కడా పరుగు ఆపలేదు. మిడ్ సెషన్ నుంచి మరింత వేగాన్ని పుంజుకుని మరీ దూసుకెళ్లాయి. చివరకు సెన్సెక్స్ 413 పాయింట్ల లాభంతో 38546 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 125 పాయింట్లు పెరిగి 11570 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 401 పాయింట్లు పెరిగి 30420 దగ్గర ముగిసింది.

ఇండియాబుల్స్ హౌసింగ్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, అదానీ పోర్ట్స్, హెచ్ సి ఎల్ టెక్, ఎస్బీఐ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. ఓఎన్జీసీ, హిందాల్కో, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో టాప్ లూజర్స్‌ జాబితాలో చేరాయి.

Share market updates: Sensex rises 413 points, Nifty ends at 11,570

బ్యాంకింగే మళ్లీ మళ్లీ కింగ్

బ్యాంక్ స్టాక్స్‌ను ఆపడం ఎవ్వరి తరమూ కావట్లేదు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడంతో ఏప్రిల్ నెలలో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చనే అంచనాలతో పాటు భారీగా వచ్చిన విదేశీ పెట్టుబడులు బ్యాంక్ నిఫ్టీ జోరును పెంచుతున్నాయి. దీంతో రోజుకో సరికొత్త గరిష్ట స్థాయిని నిఫ్టీ నమోదు చేస్తోంది. ఈ రోజు ఇంట్రాడేలో 30496 పాయింట్ల గరిష్ట స్థాయిని బ్యాంక్ నిఫ్టీ టచ్ చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఎల్ బ్యాంక్ వంటి స్టాక్స్ 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. ఇదే కోవలో ఫైనాన్స్ స్పేస్‌లో ఉన్న బజాజ్ హోల్డింగ్స్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్, ఐడిఎఫ్‌సి ఫస్ట్, కర్నాటక బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ముత్తూట్ ఫైనాన్స్ కూడా 52 వీక్ హైని టచ్ చేశాయి. ఇండియా బుల్స్ హోసింగ్ ఫైనాన్స్,జె అండ్ కె బ్యాంక్ 9 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.3 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 7 శాతం, సిండికెట్ బ్యాంక్ 5.5 శాతం, ఐడిబిఐ బ్యాంక్ 5 శాతం లాభపడ్డాయి.

గ్రాఫైట్ స్టాక్స్ మళ్లీ లేచాయ్

గ్రాఫైట్ స్టాక్స్‌లో మళ్లీ చాలా కాలం తర్వాత కొద్దిగా జోష్ వచ్చింది. గ్రాఫైట్ ఇండియా 6.7 శాతం, హెచ్ ఈ జీ 6.93 శాతం పెరిగాయి. ఇదే కోవలో రెయిన్ ఇండస్ట్రీస్ 5.17 లాభపడింది.

మిడ్ క్యాప్ మానియా

మిడ్ - స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. దీంతో మైక్రోక్యాప్ స్పేస్‌లో ఉన్న శ్రీరాయలసీమ 15 శాతం, ఖాదిమ్స్ ఇండియా 14 శాతం, అర్వింద్ ఇన్ఫ్రా 10 శాతం లాభపడ్డాయి. అపెక్స్ ఫ్రోజెన్ 9.5 శాతం, ఆర్‌పిపి ఇన్ఫ్రా 9 శాతం, ఎస్ చాంద్ 9 శాతం, మ్యాక్ హోటల్స్ 9.5 శాతం పెరిగాయి. శారదా క్రాప్‌కెమ్, టేస్టీ బైట్ ఈటబుల్స్, టేక్ సొల్యూషన్స్ కూడా 5 శాతానికి పైగానే పెరిగాయి.

52 వారాల కనిష్టానికి హీరో మోటో

మార్కెట్లు రికార్డుల దిశగా దూసుకుపోతున్న కొన్ని షేర్లు మాత్రం నీరసంగానే కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిల్లో హీరోమోటోకార్ప్ ప్రధానంగా ఉంది. వరుస సెషన్లుగా నష్టపోతున్న స్టాక్ ఈ రోజు మరో 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఈ రోజు మరో అర శాతం నష్టపోయి రూ.2530 దగ్గర క్లోజైంది.
ఇదే బాటలో లుపిన్ కూడా అర శాతానికి పైగా నష్టపోయి రూ.728 దగ్గర ముగిసింది. వొడాఫోన్ ఐడియా, లింక్ పెన్స్, షీలా ఫోమ్స్, శిల్పా మెడికేర్ కూడా ఉన్నాయి.

కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్

గత రెండు, మూడు రోజుల నుంచి భారీగా లాభపడిన కౌంటర్లలో స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ నమోదైంది. వాటిల్లో జెట్ ఎయింర్ 3 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 5 శాతం, జివికె పవర్ 4 శాతం, ఎస్కార్ట్స్ 3 శాతం, దిలీప్ బిల్డ్ 2 శాతానికి పైగా కోల్పోయాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+