మార్కెట్ అప్‌డేట్స్, లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ: బలహీనపడిన రూపాయి.. ఎందుకంటే
మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.10.50 నిమిషాలకు సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో 38,284 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 50 పాయింట్లు బలపడి 11,496 వద్ద కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ 23 పైసల నష్టంతో 69.11 వద్ద ప్రారంభమైంది. బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 98.88 వద్ద ముగిసింది. యస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా వంటి సంస్థలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, రియల్ రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
కాగా, బుధవారం ఆరంభంలో వచ్చిన లాభాలు చివరలో ఆవిరయ్యాయి. అంతకుముందు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. దీంతో ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. దీనికి తోడు మార్చి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మందగమనం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు డీలాపడ్డాయి.

జెట్ ఎయిర్‌వేస్ షేర్ల దూకుడు మాత్రం మూడో రోజు కూడా కొనసాగింది. ఏప్రిల్ చివరిలోగా నలభై విమానాలను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఇంట్రాడేలో 5.79 శాతం పెరిగిన షేరు రూ.286.70 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.27 శాతం లాభంతో రూ.277.15 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications