సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. వైట్ నేషనలిజం (శ్వేత జాతీయవాదం), సెపరేటిజాన్ని (వేర్పాటువాదం) సహించేది లేదని పేర్కొంది. ఎలాంటి జాతి విద్వేషాన్ని, జాత్యాహంకార ప్రకటనలు, ప్రసంగాలతో పాటు వేర్పాటువాద అంశాలను తమ ప్లాట్ ఫాం పైన అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వచ్చే వారం నుంచి ఈ నిర్ణయం ఇన్‌స్టాగ్రాంకు కూడా వర్తిస్తుందని తెలిపింది.
న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్‌లోని మసీదులో ఓ శ్వేత జాతి ఉన్మాది మారణ హోమం సృష్టించిన విషయం తెలిసిందే. 50 మందిని పొట్టన బెట్టుకున్న ఆ ఉన్మాది తన కాల్పులను ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. ఈ అంశంపై న్యూజిలాండ్ ప్రధాని జసిండా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ స్పందించింది. 24 గంటల్లో 1.2 మిలియన్ల వీడియోలను బ్లాక్ చేసింది. మూడు లక్షల వీడియోల అప్ లోడింగ్‌ను నిరోధించిందనట్లు తెలిపింది.

తాజాగా, జాతి విద్వేష, జాత్యాహంకార ప్రకటనలు, ప్రసంగాలతో పాటు వేర్పాటువాద అంశాలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వ్యక్తులు లేదా సంస్థలు తమ వ్యవస్థ లేదా తమ జాతి గొప్పతనం గురించి ప్రకటనలు చేయవచ్చునని, కానీ ఇతరులను కించపరచవద్దని ఫేస్‌బుక్ పేర్కొంది. దీంతో పాటు తీవ్రవాద గ్రూపుల సమాచారాన్ని గుర్తించి బ్లాక్ చేయగల సామర్థ్యం పెంచుకుంటామని తెలిపింది. అంతేకాదు, ఇలాంటి వాటి గురించి శోధించే ఖాతాదారుల సమాచారాన్ని టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడే సంస్థలకు అందిస్తామని కూడా ఫేస్‍బుక్ తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications