జస్ట్ ఫర్ ఛేంజ్!: కోడలి శ్లోకకు రూ.300 కోట్ల అరుదైన గిఫ్ట్ ఇచ్చిన నీతా అంబానీ
తన కోడలు శ్లోక మెహతాకు నీతా అంబానీ రూ.300 కోట్ల విలువైన కానుక ఇచ్చింది. తొలుత తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారు హారాన్ని తన కోడలికి పెళ్లిలో కానుకగా ఇవ్వాలని భావించారట. కానీ అందుకు భిన్నంగా వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన నెక్లస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించి తన కోడలు మెడలో అలంకరించారు. ఈ నెల 9వ తేదీన ముఖేష్, నీతా అంబానీల తనయుడు ఆకాష్ అంబానీకి తన చిన్ననాటి స్నేహితురాలు శ్లోకతో ఘనంగా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.

కోడలికి నీతా అంబానీ డైమండ్ నెక్లెస్ గిఫ్ట్
తన కోడలికి నీతా అంబానీ ఖరీదైన వజ్రాలు పొదిగిన బంగారు నెక్లెస్‌ను తన కోడలు శ్లోకకు బహూకరించారు. దీని విలువ రూ.300 కోట్లు అని తెలుస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి. తన కోడలుకు తన తరఫున అరుదైన, ప్రత్యేక బహుమతి ఇవ్వాలని భావించి దీనిని ఇచ్చారట. అందుకే ఖరీదైన డైమెండ్ నెక్లెస్‌ను ఇచ్చారు. దీనిని ప్రత్యేకంగా చేయించారట. దీని డిజైన్, వజ్రాల కట్టింగ్ అంతా ప్రత్యేకంగా ఉందట.

వదినకు ఈషా అంబానీ కూడా ఓ గిఫ్ట్
అంతేకాదు, నీతా అంబానీతో పాటు కూతురు ఇషా అంబానీ కూడా తన వదిన శ్లోక మెహతాకు అద్భుతమైన బహుమతి ఇస్తున్నారట. మంచి భవంతిని గిఫ్ట్‌గా ఇస్తున్నారు. ముఖేష్ అంబానీ గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన తన కూతురు ఇషా అంబానీ పెళ్లికి రూ.110 కోట్లు ఖర్చు చేశారట. అలాగే, ఇటీవల జరిగిన తన కొడుకు పెళ్లికి అంతకంటే భారీగా ఖర్చు చేశారట. ఈ పెళ్లి వేడుకలకు ముందు స్విట్జర్లాండులోని ఆ లగ్జరీ హోటల్లో వీకెండ్స్‌లో అతి తక్కువ ఖరీదు గల ఓ రూమ్ రోజుకు రూ.1 లక్ష. అంటే 500 మంది గెస్ట్‌ల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసి ఉంటారని భావిస్తున్నారు.

అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు
ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీకి రస్సెల్ మెహతా కూతురు శ్లోక అంబానీతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. గత ఏడాది జరిగిన ఇషా అంబానీ పెళ్లి, తాజాగా జరిగిన ఆకాష్ అంబానీల పెళ్లి అత్యంత ఖరీదైనవిగా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications