మార్కెట్ అప్‌డేట్స్: లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్, బలహీనపడిన రూపాయి
ముంబై: మార్కెట్లు బుధవారం నాడు లాభాల్లో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 11,531 వద్ద, సెన్సెక్స్ 217 పాయింట్ల లాభంతో 38,450వద్ద ట్రేడ్ అయ్యాయి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 30,034 పాయింట్లను దాటింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు బాగా లాభపడ్డాయి. మరోవైపు, ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. అమెరికా బాండ్ మార్కెట్లో నెలకొన్న అస్థిరత దీనికి కారణం.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.99 వద్ద ప్రారంభమైంది. బుధవారం 68.86 వద్ద ముగిసింది. అంటే రూపాయి కొద్దిగా బలహీనపడింది. అంటే 13 పైసలు బలహీనపడింది.

కాగా, మంగళవారం మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం, సోమవారం వరుస నష్టాలకు నిన్న అడ్డుకట్ట పడింది. చివరి గంటన్నర ట్రేడింగ్‌లో కొనుగోళ్లు బాగున్నాయి. దీంతో సెన్సెక్స్ మళ్లీ 38000 పాయింట్ల ఎగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లు బలంగా పుంజుకోవడం, రూపాయి రాణించడం కూడా ఇందుకు కారణాలు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. విదేశీ పెట్టుబడులు స్థిరంగా కొనసాగాయి.
సెన్సెక్స్ మంగళవారం 37,886.29 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 38,297.70 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 424.50 పాయింట్ల లాభంతో 38,233.41 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 129 పాయింట్లు బలపడి 11,483.25 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,352.45- 11,495.90 పాయింట్ల మధ్య కదలాడింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 22 లాభాలతో ముగిశాయి.


Click it and Unblock the Notifications