న్యూఢిల్లీ: కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గడప తొక్కాడు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ నుంచి తనకు రూ.40 కోట్లు రావాల్సి ఉందని ఆ బకాయిలు చెల్లించాల్సిందిగా ఆదేశించాలని సుప్రీంను ఆశ్రయించాడు. తాను ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేశానని, తనకు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదని పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌కు ధోనీ గతంలో ఆరేళ్లపాటు అంబాసిడర్‌గా వ్యవహరించాడు. 2009లో ఒప్పందం కుదిరింది. సంస్థపై ఫిర్యాదులు ారవడంతో 2016లో ఒప్పందం రద్దు చేసుకున్నాడు. అయితే తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కాలానికి గానూ ఆ గ్రూప్ నుంచి తనకు రూ. 40 కోట్లు రావాల్సి ఉందని, వాటిని చెల్లించే విధంగా ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆమ్రపాలి గ్రూప్ పైన అనేక కేసులు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ప్లాట్లు డెలివరీ చేయలేదని ఆ సంస్థపై 46వేల మంది పిటిషన్లు వేశారు.

మోసపూరిత కంపెనీకి ప్రచారం చేస్తున్నారని అప్పుడు ధోనీపై విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ధోనీ ఆ సంస్థతో ఒప్పందాల్ని రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు తనకు రావాల్సిన మొత్తంపై కోర్టును ఆశ్రయించాడు. అసలు, వడ్డీ కలిపి ఆ గ్రూప్ నుంచి తనకు ఇంకా రూ. 38.95 కోట్లు రావాల్సి ఉందన్నాడు.
కాగా, కొనుగోలుదారుల్ని మోసం చేసిన కేసులో ఆమ్రపాలి గ్రూప్ పైన సుప్రీం కోర్టులో విచారణ సాగుతోంది. ఇళ్లు కట్టిస్తామని చెప్పి డబ్బు తీసుకుని ఆ తర్వాత ఇళ్లు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. దాదాపు 46వేల మంది సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, వీటిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థాం... ఆమ్రపాలి డైరెక్టర్లు, బోర్డు సభ్యుల ఆస్తులను జప్తు చేయాలని అధికారుల్ని ఆదేశించింది. విచారణ నిమిత్తం సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, మరో ఇద్దరు డైరెక్టర్లను పోలీసు కస్టడీకి ఇచ్చింది.


Click it and Unblock the Notifications