గురువారం ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీ ఉన్న నేపధ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనై చివరకు నష్టాల్లో ముగిశాయి. నిన్న భారీ లాభాలను మూటగట్టుకున్న నిఫ్టీ ఈ రోజు మాత్రం నీరసించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నిరుత్సాహక సంకేతాలకు కూడా రేపు ఉన్న మార్చి సిరీస్ ఫ్యూచర్స్ ముగింపు కూడా ప్రధాన కారణం కావొచ్చు. ఉదయం నుంచి మిడ్ సెషన్ వరకూ ఫ్లాట్‌గానే ట్రేడ్ అయిన సూచీలు ఆ తర్వాత భారీగా పతనమయ్యాయి. నిఫ్టీ 11413 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంట్రాడే గరిష్టం నుంచి ఏకంగా 80 పాయింట్లు పడిపోయింది. ఆఖర్లో కొద్దిగా కోలుకుని 38 పాయింట్ల నష్టంతో 11445 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 38 పాయింట్ల నష్టంతో 38132 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం మరోసారి తన సత్తా చూపించింది. 138 పాయింట్లు పెరిగి 30,020 దగ్గర ఆగింది.
యెస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్బీఐ స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. హెచ్ పి సి ఎల్, ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్ టాప్ 5 లూజర్స్ జాబితాలో చేరాయి.

మిడ్ స్మాల్ క్యాప్ నిలబడ్డాయ్
ఈ రోజు సూచీలు నీరసంగా ఉన్నప్పటికీ మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో మాత్రం కొనుగోళ్లు కొనసాగాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 50 0.36 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 1.20 శాతం లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంకింగ్, మెటల్ రంగ కౌంటర్లు లాభపడ్డాయి. ప్రధానంగా ఫార్మా, ఆటో స్టాక్స్ మాత్రం బలహీనపడ్డాయి.
యెస్ బ్యాంక్ ఎగిరి గంతేసింది
యెస్ బ్యాంక్ ఈ రోజు ట్రేడ్‌లో భారీగా లాభపడింది. ఏకంగా 6 శాతం వరకూ పెరిగి రూ.268 దగ్గర క్లోజైంది. ఇదే కోవలో ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా 5.5 శాతం పెరిగింది. ఆర్బీఎల్ బ్యాంక్ 6 శాతం లాభపడింది. ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్‌లో మళ్లీ కొనుగోళ్లు పెరగడం, వీటిపై ఎఫ్ఐఐలకు నమ్మకం కుదరడం కూడా కారణంగా చెప్పుకోవచ్చు.
జీవీకె, జీఎంఆర్ జూమ్ జూమ్
చాలాకాలం తర్వాత జీఎంఆర్ ఇన్‌ఫ్రా రూ.21 మార్కును ఇంట్రాడేలో క్రాస్ చేసింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్ - సింగపూర్ సంస్థ జీఐసీ రూ.8000 కోట్ల పెట్టబడులు కలిసొచ్చాయి. అప్పులను సాధ్యమైనంత వరకూ తగ్గించుకుంటూ వస్తున్న జీఎంఆర్.. త్వరలో ఎయిర్‌పోర్ట్స్ ఐపీఓలోకి కూడా రాబోతోంది. ఇంట్రాడే గరిష్ట స్థాయిల దగ్గర లాభాల స్వీకరణ రావడంతో స్టాక్ 1.3 శాతం పెరిగి రూ.19.70 దగ్గర క్లోజైంది.
ఇదే కోవలో జీవీకె పవర్ అండ్ ఇన్ఫ్రా 8.5 శాతం లాభాలతో రూ.8.16 దగ్గర ముగిసింది.
రియల్ ఎస్టేట్‌లో లాభాల స్వీకరణ
గత కొద్ది కాలం నుంచి పెరుగుతూ వస్తున్న రియల్ ఎస్టేట్ స్టాక్స్‌లో కొద్దిగా లాభాల స్వీకరణ నమోదైంది. ప్రెస్టేజ్ ఎస్టేస్ట్స్ 3.7 శాతం, ఫినిక్స్ మిల్స్ 3 శాతం,స పుర్వాంకర 3.4 శాతం, డీఎల్ఎఫ్ 3.1 నష్టపోయాయి.
ఇదే బాటలో రెండు, మూడు రోజులుగా భారీగా పెరిగిన రూపా అండ్ కంపెనీ, ప్రతాప్ స్నాక్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, జెన్ టెక్నాలజీస్ స్టాక్ 5 శాతానికి పైగా కోల్పోయాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications