ఐపీఎల్ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు బడాబడా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తాయి. మ్యాచ్ సమయంలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తాయి. టెలికం కంపెనీలు రీచార్జ్ ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ కూడా అదే దారిలో పయనిస్తోంది. స్విగ్గీ.. లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ హాట్‌స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది హాట్‌స్టార్ 300 మిలియన్ వ్యూలు చేరుకుంటాయని భావిస్తున్నారు.
మీరు క్రికెట్ చూస్తూనే అక్కడి నుంచి ఇష్టమైన ఆహారాన్ని తినవచ్చు. మ్యాచ్ చూస్తున్న సమయంలో హాట్‌స్టార్ నుంచి బయటకు రాకుండానే మనకు కావాల్సిన ఆహారాన్ని తెప్పించుకునే ఫీచర్ ఉంది. క్రికెట్ ఫ్యాన్స్ హాట్‌స్టార్ యాప్‌లో క్రికెట్ చూస్తూ అదే యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ఇందుకోసం స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. హాట్ స్టార్ యాప్ ఓపెన్ చేస్తే స్విగ్గీకి ఆర్డర్ వెళ్తుంది. మీకు స్విగ్గీ యాప్‌లో కనిపించే రెస్టారెంట్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి. ఐపీఎల్ 2019 కోసం ప్రత్యేకంగా ఈ ఒప్పందం కుదిరింది.

గత ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఫుడ్ ఆర్డర్స్ 25 శాతం పెరిగాయట. క్రికెట్, ఆహారం పట్ల భారతీయులకు ఉన్న ఇష్టాన్ని నెరవేర్చేందుకే హాట్‌స్టార్‌తో భాగస్వాములమయ్యామని స్విగ్గీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో 75,000 రెస్టారెంట్‌లతో స్విగ్గీ కలిసి పని చేస్తోంది. గత ఐపీఎల్ సీజన్‌లో క్రికెట్ అభిమానులు వివిధ రకాల ఆహారాన్ని రుచి చూసేందుకు ఇష్టపడ్డారని స్విగ్గీ విశ్లేషణలో తేలింది.
ఏ ప్రాంతంలోనివారు దేనిని ఎక్కవగా ఆర్డర్ చేశారో కూడా విశ్లేషణలో వెల్లడైంది. బెంగళూరుకు చెందినవారుపిజ్జా, చండీగఢ్‌వాసులు కడాయ్ పన్నీర్, దాల్ మఖ్నీ, బటర్ నాన్, చెన్నైవాసులుచికెన్, మటన్ బిర్యానీ వైపు ఎక్కువగా ఆర్డర్ చేశారు. ఎక్కువ ఆర్డర్లు ఢిల్లీ నుంచి వచ్చాయి. అక్కడి వారు బటర్ నాన్, దాల్ మఖ్నీ తినడానికి ఆసక్తి చూపించారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications