For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెల రోజుల తర్వాత భారీగా పతనం..100 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ

By Chanakya
|

నెల రోజుల తర్వాత స్టాక్ మార్కెట్లలో అతిపెద్ద సింగిల్ డే నష్టాలను చవిచూశాయి. ఫిబ్రవరి 26వ తేదీ తర్వాత మళ్లీ ఇప్పుడే మార్కెట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి. సెన్సెక్స్ 38 వేల పాయింట్ల సెంటిమెంట్ మార్క్ దిగువన క్లోజైంది. అన్ని రంగాల్లో షేర్లూ నష్టాల్లో క్లోజయ్యాయి. చివరకు సెన్సెక్స్ 355 పాయింట్ల నష్టంతో 97808 దగ్గర ముగిసింది. నిఫ్టీ 102 పాయింట్లు కోల్పోయి 11354 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ 301 పాయింట్లు నష్టపోయింది. ప్రధానంగా రిలయన్స్, హెచ్ డి ఎఫ్ సి, ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్స్ మార్కెట్లను పడదోశాయి.

భారీ నష్టాల్లో మార్కెట్లు, మరింత బలహీనపడిన రూపాయి: కారణాలివేభారీ నష్టాల్లో మార్కెట్లు, మరింత బలహీనపడిన రూపాయి: కారణాలివే

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నిరుత్సాహక సంకేతాలతో 11395 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ మళ్లీ ఏ దశలోనూ కోలుకున్న దాఖలాలు కనిపించలేవు. లిక్విడిటీ తగ్గిపోవడం, లాభాల స్వీకరణకు ట్రేడర్లు మొగ్గుచూపడం వంటి కారణాలతో ఇంట్రాడేలో నిఫ్టీ 11311 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. చివర్లో కొద్దిగా కోలుకుని 11354 దగ్గర నిలిచింది. ముఖ్యంగా మీడియా, రియాల్టీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ కౌంటర్లలో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. అన్ని రంగాల సూచీలూ నష్టాల బాట పట్టాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ పావు శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.66 శాతం కోల్పోయాయి.

Sensex sinks 355 points on global growth woes

ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, హెచ్ పి సి ఎల్, పవర్ గ్రిడ్ స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్, వేదాంతా, భారతి ఇన్ఫ్రాటెల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, యూపీఎల్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

నరేష్ గోయెల్ ఛైర్మన్‌గా వైదొలిగితేనే సంస్థలో పెట్టుబడులు పెడ్తామంటూ జెట్ ఎయిర్‌వేస్‌పై ఒత్తిడి తెస్తున్నారు రుణదాతలు. ఇక ఆఖరి అవకాశం కావడం, వేరే గత్యంతరం లేకపోవడంతో నరేష్ గోయల్, అతని భార్యా అనితా గోయల్ సంస్థకు రాజీనామా చేశారు. బోర్డ్ మీటింగ్ అనంతరం తమ నిర్ణయాన్ని వెల్లడించారు. వెంటనే రుణదాతలు రూ.1500 కోట్ల సొమ్మును సంస్థకు అప్పుగా ఇచ్చి, గాడిలో పెట్టే ప్రయత్నాల్లో పడ్డారు.
ఈ వార్తల నేపధ్యంలో జెట్ ఎయిర్ స్టాక్ ఆఖర్లో 12.5 శాతం పెరిగి రూ.254 దగ్గర ముగిసింది.

సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ర్యాలీ

కొద్ది రోజుల నుంచి ఎస్ఐఎస్ షేర్‌లో యాక్టివిటీ ఎక్కువగా ఉంది. వాల్యూమ్స్‌తో సహా స్టాక్ పెరుగుతోంది. ఈ రోజు కూడా ఈ స్టాక్ 8 శాతం వరకూ ఇంట్రాడేలో పెరిగింది. వాల్యూమ్స్ 20 రోజుల యావరేజ్‌తో పోలిస్తే 40 రెట్లు పెరిగాయి. చివరకు స్టాక్ 5 శాతం పెరిగి రూ.856 దగ్గర క్లోజైంది.

క్రూడ్ కూల్.. మన స్టాక్స్ జూమ్

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు కూల్ అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ 66.36 డాలర్ల దగ్గర కొట్టుమిట్టాడుతోంది. ఇది మన దేశీయ చమురు సంస్థలకు పాజిటివ్ కావడంతో ఈ రోజు ఆయిల్ రిటైలర్ స్టాక్స్ లాభపడ్డాయి. బీపీసీఎల్, హెచ్ పి సీ ఎల్ 2 శాతంవరకూ పెరిగితే, ఇండియన్ ఆయిల్ కార్ప్ 5 శాతం వరకూ పెరిగింది.

మిడ్ క్యాప్‌లో మంటలు

మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో సెల్లింగ్ ప్రెషర్ అధికమవుతోంది. ఈ రోజు డిష్ టీవీ, ఎడిల్వైజ్, కెఆర్‌బిఎల్, మహీంద్రా సీఐఈ, దిలీప్ బిల్డ్, సాగర్ సిమెంట్స్, కెపాసైట్ ఇన్ఫ్రా స్టాక్స్ 5 శాతానికి పైగా కోల్పోయాయి.

English summary

నెల రోజుల తర్వాత భారీగా పతనం..100 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ | Sensex sinks 355 points on global growth woes

Fears of a potential recession in the US sank Indian equities on Monday as heightened global growth worries made investors stay away from riskier assets.
Story first published: Monday, March 25, 2019, 17:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X