For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ యాప్‌ను వాడుతున్నారా, జాగ్రత్త... మీ ఫోన్ వాళ్లే ఆపరేట్ చేస్తారు: హెచ్‌డీఎఫ్‌సి వార్నింగ్

|

'ఎనీడెస్క్' యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ కూడా తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ యాప్ వాడితే మోసగాళ్ళబారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరించింది.

అమెరికా కంపెనీని టీసీఎస్ డేటా చోరీ చేసిందా? అమెరికా కంపెనీని టీసీఎస్ డేటా చోరీ చేసిందా?

'ఎనీడెస్క్' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని మోసగాళ్లు కోరుతారని, 9 అంకెల కోడ్ తమతో షేర్ చేసుకోమని అడుగుతారని, మీరు కనుక అలా చేస్తే మీ ఫోన్లు హ్యాకింగ్‌కు గురవుతాయని హెచ్‌డీఎఫ్‌సీ తమ కస్టమర్లను హెచ్చరించింది. అలా చేస్తే మీ ఖాతాలోని డబ్బులు మాయం అవుతాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

After RBI, HDFC AnyDesk Warning: Save money, dont use THIS app! Check how fraudsters may lure you

మీ క్రెడిట్ కార్డ్ వివరాలు, ఓటీపీ, పిన్ నెంబర్లను ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దని తెలిపింది. ఎనీడెస్క్ యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు మీ ఫోన్‌ను ఆపరేట్ చేసే అవకాశముందని తెలిపింది. యూపీఐ ద్వారా డబ్బులు కొట్టేసే ప్రమాదముందని తెలిపింది. ఏదైనా డౌట్ ఉంటే బ్యాంకు అధికారులను సంప్రదించాలని తెలిపింది.

సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి తాము బ్యాంకు అధికారులమని చెబుతారని, మొబైల్ బ్యాకింగ్ యాప్‌లో సమస్యలను, వాటిని సరిచేసుకునేందుకు ఎనీడెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని కోరుతారని, ఆ తర్వాత 9 అంకెల కోడ్ చెప్పమని అడుగుతారని, అది చెబితే మీరు నేరగాళ్ల బారిన పడినట్లేనని చెబుతున్నారు. మీ ఫోన్ వారి కంట్రోల్లోకి వెళ్తుందని తెలిపారు. ఈ మెయిల్స్, ఫోటోలు, కాంటాక్ట్ వివరాలు కూడా వారి చేతిలో పడే ప్రమాదముందని హెచ్చరించింది.

పొరపాటును ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించి మీ అకౌంట్‌ను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయించుకోవచ్చునని తెలిపింది. తెలియని కాంటాక్టుల నుంచి వచ్చే సందేశాలు, వాట్సాప్ రూపంలో వచ్చే లింకులను ఓపెన్ చేయకుండా దూరం ఉండటమే మంచిదని చెబుతున్నారు.

English summary

ఈ యాప్‌ను వాడుతున్నారా, జాగ్రత్త... మీ ఫోన్ వాళ్లే ఆపరేట్ చేస్తారు: హెచ్‌డీఎఫ్‌సి వార్నింగ్ | After RBI, HDFC AnyDesk Warning: Save money, don't use THIS app! Check how fraudsters may lure you

HDFC Bank Warning: After the Reserve Bank of India (RBI) warned banks and customers against the use of AnyDesk App, the HDFC Bank is also warning its customers about the same.
Story first published: Monday, March 25, 2019, 17:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X