న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు 4జీ సేవలకు అనువైన తరంగాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని టెలికం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)లకు 4జీ స్పెక్ట్రం కేటాయించాలని ట్రాయ్‌కి సిఫార్సు చేసినట్లు గత నెలలో టెలికం శాఖ (డీవోటీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ట్రాయ్ సీనియర్ అధికారి ఒకరు చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

బీఎస్ఎన్‌ఎల్, ఎంటీఎన్ఎల్లకు 4జీ సేవల సౌకర్యం కల్పించాలని డీవోటీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ట్రాయ్‌కి చెప్పామని డీవోటీ చెప్పింది. కానీ అదేం లేదని ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్ఎల్లకు 4జీ స్పెక్ట్రం కేటాయింపుపై డీవోటీ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని ఓ అధికారి ప్రముఖ ఇంగ్లీష్ పత్రికతో చెప్పారు. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు 4జీ సేవల్లో దూసుకెళ్తున్నాయి. 4జీ అనుమతిలేని ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం వీటితో పోటీపడలేక నష్టాల్లో కూరుకుపోతున్నాయి.
బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ రుణం భారం రూ.35,000 కోట్లకు పైగా ఉంది. ఉద్యోగులకు జీతాలను కూడా చెల్లించలేని పరిస్థితులో ఉంది. బీఎస్ఎన్ఎల్‍లో 1,70,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications