స్టార్టప్ లపై పన్ను మినహాయింపు కు ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టు కనిపిస్తోంది. దీంతో స్టార్టప్ యజమానుల్లో ఆందోళన నెలకొంది. స్టార్టప్ కంపెనీలకు మినహాయింపు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. అయితే దీనిపై ఐటీ శాఖ అధికారులు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో యజమానులు ఆందోళన నెలకొంది.
ఐటి చట్టం 56 (2) ప్రకారం పన్ను మినహాయింపు ఇవ్వడానికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంటర్నల్ ట్రేడ్ నెలరోజుల కింద నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదు.
దీనికి కారణం పన్ను మినహాయింపు ఇవ్వడానికి ప్రభుత్వం వెనక్కి తగ్గటం అని భావిస్తున్నారు. శుక్రవారం రోజు 92 స్టార్టప్ కంపెనీ లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ నుండి ఈ మెయిల్స్ వచ్చాయి. డీపీఐఐటీ కి అందించిన ఫారం 2 సెల్ఫ్ డిక్లరేషన్ రసీదులు అందాయి అన్నది ఆ ఈ-మెయిల్స్ సారాంశం. అంటే మినహాయింపులు ఇస్తామని ఎక్కడా హామీ ఇవ్వలేదు అన్నది దాని అర్థం. కేవలం ఫారం 2 అప్లోడ్ చేసినట్టుగా మాత్రమే పంపించారని మినహాయింపుల గురించి ఏమీ చెప్పలేదని స్టార్టప్ కంపెనీలు ఆందోళనలో ఉన్నాయి.

ఇక సిబిడిటి నుండి టాక్స్ నోటీసులు రాకుండా, డి పీ ఐ ఐ టి నుండి నేరుగా మినహాయింపులు వచ్చేలా ఆటోమేటెడ్ సిస్టం డెవలప్ చేయాలని స్టార్టప్ లు, ఏంజెల్ ఇన్వెస్టర్లు , పలు పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరిన నేపధ్యంలో దీనిపై స్పందించిన కొన్ని శాఖలు స్టార్టప్ లకు ఒక ఫారం అందజేస్తామని ఆ ఫారం చూపిస్తే మినహాయింపు వస్తుందని చెప్పారు.
అసలు డి పీ ఐ ఐ టి ఏంజెల్ టాక్స్ ను రద్దు చేస్తూ అధికారిక ప్రకటన చేసిందని , గతంలో 10 కోట్ల లోపు పెట్టుబడులకు ఉన్న పన్ను మినహాయింపును ఇప్పుడు 25 కోట్ల వరకు పెంచిందని స్టార్టప్ కంపెనీల యజమానులు చెబుతున్నారు.
అయితే ఇంత చెప్పిన తరువాత ఏంజెల్ టాక్స్ చెల్లించాలంటూ తమకు నోటీసులు వచ్చాయని, ఈ నోటీసుల వల్ల తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ షేర్ ప్రీమియంపై టాక్స్ కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏది ఏమైనా పన్ను మినహాయింపు జాప్యం చేయడంతో, అసలు పన్ను మినహాయింపు వస్తుందా లేదా అని, ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గిందా అని స్టార్టప్ యజమానుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications