ఫ్లిప్ కార్ట్ లో 70 శాతానికి పైగా వాటాను వాల్ మార్ట్ దక్కించుకున్న విషయం అందరికీ తెలుసు. అయితే వాల్ మార్ట్ నుండి ఫోన్ పే కు సింగపూర్ కి చెందిన తన మాతృసంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ పే తాజాగా 743.5 కోట్ల పెట్టుబడులను అందించింది. గతంలో ఫ్లిప్ కార్డ్ పేమెంట్ ద్వారా ఫోన్ పే కు వచ్చే పెట్టుబడులు, ఇప్పుడు వాల్ మార్ట్ 70 శాతానికి పైగా ఫ్లిప్ కార్ట్ లో వాటాను సొంతం చేసుకోవడంతో వాల్ మార్ట్ స్వయంగా చెల్లిస్తోంది .
2017 లోనూ వాల్ మార్ట్ ఫోన్ పే కు 500 మిలియన్ల డాలర్లు పెట్టుబడిగా అందజేసింది. అంటే ఇది దాదాపు ఇండియన్ కరెన్సీలో చూస్తే 3450 కోట్ల పెట్టుబడి.ఇక గత ఏడాది నుంచి ఈ మొత్తాన్ని ఇంటర్నల్ రౌండ్స్ విధానంలో వాల్ మార్ట్ ఫోన్ పే కు పంపిస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ఫోన్ పే కు ఈ పెట్టుబడులు నగదు నిల్వలు పెంచుకోవడానికి ఉపకరిస్తాయని తెలుస్తోంది.
అంతేకాక ఫోన్ పే తన యాప్ ను మరింత ప్రచారం చేసుకోవడానికి కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ను నియమించుకుంది. ఈ ఏడాది కేవలం ప్రచార కార్యక్రమాల కోసమే 500 కోట్ల రూపాయలను కేటాయించింది ఫోన్ పే. ఇక వాల్ మార్ట్ నుండి 743.5 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఈ మేరకు ఫోన్ పే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కు సమాచారం అందించారు.

ఎస్ బ్యాంకు తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ సేవలందిస్తున్న ఫోన్ పే పేటియం, గూగుల్ పే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటుంది. ఇక పేటియం ప్రత్యేక ఆఫర్లను, క్యాష్ బ్యాక్ లను ఇస్తుంది. స్క్రాచ్ కార్డుల ద్వారా గూగుల్ పే కూడా కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. త్వరలో వాట్సాప్ కూడా డిజిటల్ పేమెంట్స్ విభాగంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. ఇక అది కూడా జరిగితే పోటీని తట్టుకోవడం కోసమైనా గూగుల్ పే, ఫోన్ పే వంటి కంపెనీలు ప్రచార కార్యక్రమానికి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక వాల్ మార్ట్, ఫ్లిప్ తో పాటు ఫోన్ పే లో వాటా కోసం గతేడాది 16 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1.10 లక్షల కోట్లు చెల్లించింది.
ఫోన్ పే ప్రస్తుతం పోటీని తట్టుకొని నిలబడటం కోసం వాల్ మార్ట్ నుండి వచ్చిన పెట్టుబడిని ఉపయోగించనుంది. దేశంలోని వాల్ మార్ట్ స్టోర్స్ లో ఫోన్ పే యాప్ ద్వారా పేమెంట్స్ కి ఒప్పందం కుదుర్చుకున్న నేపధ్యంలోనే ఈ పేమెంట్స్ చేస్తుంది.


Click it and Unblock the Notifications