For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇది మీకు తెలుసా?: ఎస్‌బీఐ హాలీడే సేవింగ్స్ అకౌంట్‌తో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు, ఇలా చేయాలి

|

న్యూఢిల్లీ: మీ కుటుంబం, మిత్రులతో హాలీడే ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఒక్కసారే ట్రిప్ అంటే భారంగా భావిస్తున్నారా? అయితే ఎస్‌బీఐ ఒక ఆకర్షణీయమైన రికవరింగ్ డిపాజిట్ (ఆర్డీ) ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. హాలీడే వెకేషన్ ఖర్చు మొత్తం ఒకేసారి భారం కాకుండా ఉండేందుకు 12 నెలల వ్యవధిలో రికరింగ్ డిపాజిట్ వేసుకునేందుకు వీలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

'నవజీవన్' పాలసీని లాంచ్ చేసిన ఎల్ఐసీ: ఇది ఎవరికి'నవజీవన్' పాలసీని లాంచ్ చేసిన ఎల్ఐసీ: ఇది ఎవరికి

ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ థామస్ కుక్‌తో కలిసి ఈ హాలీడే ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్ (ఆర్డీ) ప్యాకేజీని ఎస్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆర్డీని ఎస్‌బీఐ ఆన్‌లైన్ ద్వారా ఆటోమేటిక్ పద్ధతిలో చేసుకునే వీలుంది. SBI sbi.co.in. కు వెళ్తే అకౌంట్ హోల్డర్ పేరు మీద జనరేట్ అవుతుంది.

SBI Holiday Savings Account: Know All About It

హాలీడే సేవింగ్స్ అకౌంట్ కాల వ్యవధి 12 నెలలు. థామస్ కుక్ అందిస్తున్న హాలీడే ప్యాకేజీ ధరల ఆధారంగా సంవత్సరం ముందు నుంచే ఈ ఆర్డీ అకౌంట్ ప్రారంభించే వీలు కల్పించారు. నెలకు ఎంత మొత్తం అనే అంశం మీ ప్యాకేజీ ఆధారంగా ట్రావెల్ ఏజెన్సీ నిర్ణయిస్తుంది.

ఆర్డీ అకౌంట్ మొత్తంపై 6.8 శాతం వడ్డీ చెల్లిస్తారు. 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు మరింత వడ్డీ చెల్లిస్తారు. నెలవారీ డిపాజిట్ ఆలస్యమైతే ప్రతి రూ.100కు రూ.1.50 పైసలు పెనాల్టీ ఉంటుంది. కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ (సీఐఎఫ్) ప్రకారమే టీడీఎస్ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఈ మొత్తం థామస్ కుక్‌కు ట్రాన్సుఫర్ అవుతుంది. ఆర్డీ గడువు కంటే ముందే కూడా క్లోజ్ చేసుకోవచ్చు.

ఆర్డీ అకౌంట్‌ను ముందే క్లోజ్ చేసుకోవచ్చు. కానీ పెనాల్టీ ఉంటుంది. ఆ తర్వాత ఆ ఎమౌంట్ బ్యాంక్ అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతుంది. ఎస్‌బీఐ అకౌంట్ హోల్డర్లు అందరూ ఈ హాలీడే సేవింగ్స్ అకౌంట్‌ ఓపెన్ చేయడానికి అర్హులే.

English summary

ఇది మీకు తెలుసా?: ఎస్‌బీఐ హాలీడే సేవింగ్స్ అకౌంట్‌తో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు, ఇలా చేయాలి | SBI Holiday Savings Account: Know All About It

In an attempt to help holiday goers to help save for the most sought after holidays, SBI in partnership with Thomas Cook, has designed a unique RD account. The account is generated in the name of the account holder as per the website of SBI sbi.co.in.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X