ముంబై: జెట్ ఎయిర్‌వేస్ గత మూడు నెలలుగా పైలట్లు సహా తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో పైలట్లు కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఏప్రిల్ 1వ తేదీలోపు తమ వేతనాలు చెల్లించకుంటే తాము విమానాలు ఆపేస్తామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో పైలట్లు తమ కష్టాలను వెళ్లగక్కుతున్నారు. నిత్యావసర ఖర్చుల కోసం ఇంట్లోని తమ నగలను తాకట్టు పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెట్ పైలట్ల యూనియన్ హెడ్ కెప్టెన్ కరణ్ చోప్రా విమానయాన శాఖకు రాసిన లేఖలో పలు అంశాలను పేర్కొన్నారు. సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.

విమానాల భద్రతపై ప్రభావం చూపే ప్రమాదం
విమానం కాక్‌పిట్‌లోకి వెళ్లగానే ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తామని, కానీ తాము కూడా సాధారణ మనుషులమేనని, జీతాలు రావట్లేదని ఒత్తిడి కారణంగా తాము కాక్‌పిట్‌లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని, ఇది విమానాల భద్రతపై ప్రభావం చూపే ప్రమాదముందని, కంపెనీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ తమకు స్పష్టమైన సమాచారం లేదని, ఎస్బీఐ లాంటి రుణదాతలు జెట్ సమస్యను గట్టెక్కించగలరా అన్నది తెలియరావట్లేదు అని ఆ లేఖలో పేర్కొన్నారు. పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు, నిత్యావసర వస్తువుల కోసం పైలట్లు అవస్థలు పడుతున్నారని, కొందరు అయితే డబ్బుల కోసం తమ తల్లి నగలు తాకట్టు పెడుతున్నారన్నారు.

సర్.. తల్లి నగలు తాకట్టు పెట్టా
పైలట్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని కెప్టెన్ చోప్రా అన్నారు. పైలట్లు తమ తమ ఈఎంఐలు కూడా చెల్లించాల్సి ఉందని చెప్పారు. పిల్ల చదువులు, ఆసుపత్రి ఖర్చులతో పాటు ప్రస్తుత పరిస్థితి కారణంగా వారి ఇళ్లలోని పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కొంతమంది పైలట్లు తనను సంప్రదించి.. సర్ మేం నా తల్లి నగలు కుదువపెట్టానని చెబుతున్నారని, వారి పరిస్థితి చూస్తుంటే బాధాకరంగా ఉందని చెప్పారు. కాబట్టి తమ వేతనాలు చెల్లించాలని యాజమాన్యానికి చెప్పాలని కోరారు.

రెండు డిమాండ్లు
మరో కెప్టెన్ ఆసిమ్ వలియాని మాట్లాడుతూ... ఒకవేళ కంపెనీ దివాలా తీస్తే 1500 మంది పైలట్లు రోడ్డుమీద పడతారని, అందరికీ వెంటనే ఉద్యోగాలు వస్తాయో రావో కూడా తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ జీతాలు చెల్లించకుంటే వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి విధులకు హాజరుకాబోమని, ఇందుకు 1100 మంది పైలట్లం ఏకతాటి పైన ఉన్నామని తెలిపారు. తమ రెండు డిమాండ్లు నెరవేర్చలేదన్నారు. ఒకటి తమ వేతనాలు చెల్లించడం, రెండు.. సంస్థ గట్టెక్కేందుకు సరైన రోడ్ మ్యాప్ కావాలన్నారు. ఈ డిమాండ్లు నెరవేరకుంటే విమానాలు ఆపేస్తామన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications